దీపావ‌ళి వెలుగుని పంచిన స్టాక్‌మార్కెట్‌



స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలను ఆర్జించడంతో ‘విక్రమ’ శకం (2067) ఉత్సాహంగా ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహించిన మధ్యంతర ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు పావుశాతం పెంచినా మార్కెట్ ప్రతికూలంగా స్పందించకుండా ముంబయి స్టాక్ మార్కెట్ సె న్సెక్స్ 316 పాయింట్లు లాభపడింది. సోమవారం లాభపడిన సెనె్సక్స్ మంగళవారం కూడా 315.58 పాయింట్లు పెరగడంతో 17,254.86 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ కూడా 93.25 పాయింట్లు లాభపడి 5,191.60 వద్ద ముగిసింది. పెట్టుబడిదారులు అక్టోబర్ నెల సెటిల్‌మెంట్లు క్లియర్ చేసుకుని బుధవారం దీపావళి పండుగ సందర్భంగా 90 నిమిషాల పాటు జరిగే ‘మూరత్’ ట్రేడింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధపడ్డారు. ఆ తర్వాత ‘2068’ కొత్త శకానికి శ్రీకారం చుట్టనున్నారు.
రిజర్వ్‌బ్యాంక్ మంగళవారం నిర్వహించిన ద్రవ్యసమీక్షలో వరుసగా 13వసారి (మార్చి 2010 నుంచి) వడ్డీరేట్లను పావుశాతం పెంచింది. వడ్డీరేట్లు పెంపు ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై ఉండవచ్చునన్న భయాలకు తోడు సేవింగ్స్‌రేట్లపై నియంత్రణ తొలగించడంతో లాభాలు దెబ్బతినవచ్చునన్న అంచనాలు బ్యాంకింగ్ షేర్లను నష్టాల్లోకి నెట్టాయి.
హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ షేర్లు 3 శాతం వంతున క్షీణించగా, ఐసిఐసిఐ బ్యాంక్ 1 శాతం పెరిగింది. ఐటి కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ఐటి ఇండెక్స్ 2.66 శాతం లాభపడింది. ఆటో ఇండెక్స్ 2.95 శాతం పెరిగింది. ఈ పండుగ సీజన్‌లో ఆటోరంగ అమ్మకాలు పెరిగి లాభాలు గడిస్తాయన్న ఆశ ఇందుకు కారణంగా విశే్లషకులు భావిస్తున్నారు. మహీంద్ర అండ్ మహీంద్ర 5 శాతం లాభపడగా, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, స్టెరిలైట్, బజాజ్ ఆటో 4 శాతం వంతున పెరిగాయి. రిలయన్స్ 3.4 శాతం, లార్సన్ అండ్ టుబ్రో 3.2 శాతం పెరిగింది. ఎన్‌టిపిసి మంగళవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆ కంపెనీ నికరలాభం 15 శాతం పెరిగి 2,424 కోట్ల రూపాయలు సాధించింది. ఈ కంపెనీ స్టాక్ 1.4 శాతం వృద్ధి చెందింది. ఇక దీపావళి పండుగ సందర్భంగా సాయంత్రం ‘మూరత్’ ట్రేడింగ్ కొనసాగుతుంది. గురువారం దీపావళి సందర్భంగా మార్కెట్లకు సెలవు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!