టిఎన్‌జీవో సంఘం నాయ‌కుల ప్రక‌ట‌న వెనుక‌..


తెలంగాణ ఎన్జీఓల సంఘం వ్యూహాత్మకంగా చెబుతున్నదో, లేక నిజంగానే చెబుతున్నదో కాని మళ్లీ తెలంగాణపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చేదాక సమ్మెచేస్తామని ప్రకటించింది. టిఎన్జీఓల నాయకులు స్వామిగౌడ్,శ్రీనివాసగౌడ్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని,కేసులకు భయపడి ఉద్యోగులు సమ్మె విరమించుకోబోరని వారు చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలపై నలభై కేసులు ఉన్నాయని వారు తెలిపారు. ఒకపక్క ఉద్యోగుల సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ , మరో వైపు తెలంగాణ ప్రకటన వచ్చే దాక సమ్మె చేస్తామనడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది.పైగా స్వామి గౌడ్ సమ్మె వల్ల ఉద్యోగులే బలైపోతున్నారని,780 కోట్ల రూపాయల మేర ఉద్యోగులు నష్టపోయారని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసి సమ్మె విరమించగా, టీచర్లు మంగళవారం నుంచి విధులకు హాజరు అయ్యే అవకాశం ఉంది. కాగా సింగరేణిలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమ్మె కొనసాగించే పరిస్తితి ఉంటుందా? అయితే బంద్ ను దృష్టిలో పెట్టుకుని,ఇతర డిమాండ్లను గమనంలోకి తీసుకుని వారు ఈ ప్రకటన చేసి ఉండవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!