దానంపై ఎస్టీ ఎస్టీ అత్యాచారాల కేసు..


మంత్రి శంకరరావు తాజాగా సిటీకి చెందిన దానం నాగేందర్ పై ఇప్పుడు తన బాణాన్ని సంధించారు. ఆయనపై ఎస్.ఎటి. అత్యాచారాల కేసు నమోదు అయ్యేలా శంకరరావు ఒత్తిడి తెచ్చారని కధనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల సంక్షోభాలను ఎదుర్కుంటున్న తరుణంలో ఇది కొత్త కోణంగా ఉంది. విశేషం ఏమిటంటే వీరిద్దరూ కూడా రాజీనామాలు చేయకుండా ప్రభుత్వంలోనే ఉన్నారు.తెలంగాణ ఉద్యమంలో వీరిద్దరూ కూడా భాగస్వాములు కాకుండా ఉంటున్నారు.అయితే ఆదివారం ఉదయం అడ్డగుట్ట వద్ద ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి నాగేందర్ వెళుతుండగా టిఆర్ఎస్ కార్యకర్తలు,కొందరు తెలంగాణ ఆందోళనకారులు కోడిగుడ్లతో దాడిచేశారు. దానిపై ఆగ్రహం చెందిన మంత్రి దానం నాగేందర్ అనుచరులు వారిపై ఎదురుదాడి చేసి కొట్టారు. దీనిపై వారు దానం అనుచరులపై కేసుపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ దశలో మంత్రి శంకరరావుకూడా దానం నాగేందర్ ను విమర్శిస్తూ మీడియాతో మాట్లాడారు. అంతేకాక దానం నాగేందర్ పై, ఆయన అనుచరులపై ఎస్.సి.,ఎస్.టి కేసుపెట్టాలని ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. పరస్పరం దాడులు చేసుకున్నంతవరకు కేసులు పెట్టుకుంటే అంతవరకు ఎవరూ ఆక్షేపణ చెప్పరు. కాని ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధ చట్టం కింద కేసు నమోదు చేయడమే కాస్త ఆసక్తికరమైన విషయంగా ఉంది. ఎందుకంటే దాడి, ఎదురు దాడి జరిగినప్పుడు ఎవరు ఏ కులమో చూసుకుని చేసుకునే సందర్భంగా దీనిని తీసుకోలేం. తెలంగాణ ఉద్యమం చేస్తున్నవారుగా, దానిని వ్యతిరేకిస్తున్నవారిగానే పరిగణనలో తీసుకోవాలి.పైగా తెలంగాణ ఆందోళనకారులు దాడి చేసినప్పుడుఈ గొడవ మొదలయింది. అయితే సహజంగా ఈ కేసులు పెట్టినప్పుడు పోలీసులు విచారణ చేసి ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల చట్టం కింద కేసు విచారణ చేయవచ్చా అన్నది పరిశీలించి తదుపరి చర్యకు ఉపక్రమిస్తారు. మరి దానం నాగేందర్ మంత్రిగా కూడా ఉన్నారు.అందువల్ల ఈ కేసుల కాంగ్రెస్ లోకొత్త వివాదానికి, కేసుల వ్యవహారంలో కొత్త మలుపు తిరగడానికి అవకాశం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!