సినిమా షూటింగుల‌కి తెలంగాణ సెగ‌


హాస్య నటుడు సునీల్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘పూలరంగడు’ సినిమా షూటింగ్ కు తెలంగాణ సెగ తగిలింది. శంషాబాద్ మండలం చౌదరిగూడలో జరుగుతున్న షూటింగ్ ను మంగళవారం తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో చిత్ర యూనిట్ షూటింగ్ ను నిలిపివేసింది. కాగా నిన్న సూరారం పరిసర ప్రాంతాల్లో సోమ‌వారం నాడు హీరో నితిన్ న‌టిస్తున్న ఇష్క్ చిత్రం షూటింగ్‌ని కూడా తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. హీరో నితిన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన‌వాడే కావ‌డం విశేషం. అయితే తెలంగాణ వాదులు హీరో నితిన్ చేత జై తెలంగాణ అనిపించుకుని అక్కడినుండి వెళ్ళారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!