సిఎం, టి-ఎంపిలు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు..


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలపై ఎదురుదాడి చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీని కలిసి తాజా పరిణామాలన్నటిని తెలియచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కొందరు తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ఆందోళనలలో పాల్గొనడం, చట్ట విరుద్దంగా రైల్ రకో ఆందోళనలో పాల్గొనడం, వద్దని చెప్పినా వినకుండా ఆందోళన కార్యక్రమాలలో చురుకుగా ఉండడం, అరెస్టు అయితే అక్రమ అరెస్టులు అని తప్పుడు ప్రచారం చేస్తుండడంవల్ల పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తున్నదని కిరణ్ వారికి వివరిస్తున్నారు. సకల జనుల సమ్మెకు వీరు మద్దతు ఇచ్చిన తీరు, సమ్మెలలో ఉన్నవారిని ఒక్కొక్కరిని దారిలోకి తెచ్చుకున్న వైనంపై ఆయన అధిష్టానానికి వివరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలను కట్టడి చేయవలసిన అవసరం ఉందని ఆయన కేంద్ర నేతలకు వివరించారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేయబోతున్నామని ప్రకటించారు. వారు ఎంతవరకు తమ వాదన వినిపించారో కాని కిరణ్ మాత్రం ప్రణబ్, సోనియా లకు ఆధార సహితంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంపై గట్టి ఫిర్యాదు చేశారని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!