పోల‌వ‌రం టెండ‌ర్లు క్యాన్సిల్ చేయాల్సిందే..!


పోలవరం టెండర్లపై మరోసారి తెలుగుదేశం పార్టీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. పోలవరం టెండర్లపై టిడిపి లేవదీసిన అంశాలపై చర్చకు కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రకటించారు. SEW కంపెనీకి చెందిన రాజాం నమస్తే తెలంగాణ పత్రికకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన టెండర్లు పూర్తికాక ముందు సీఎంని కలిసినట్లుగా శ్రీహరి ఆరోపించారు. ఆయనకు సీఎంను కలవాల్సినవసరం ఏముందని శ్రీహరి ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇవ్వాల్సిందిపోయి తిరిగి మాకు సవాల్ చేయడం వెనుక ఆంతర్యమేంటని కడియం ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటని, వేరే కంపెనీ ఎక్స్‌పీరియన్స్ లెటర్ పెట్టిన ఓ షూ కంపెనీకి అప్పజెప్పడం ఏంటని కడియం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై మాకు స్పష్టమైన వైఖరి ఉందని, ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని శ్రీహరి చెప్పారు. అయితే నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు, గ్రామాలు ఎక్కువశాతం మునిగిపోకుండా, భూసేకరణలో ఇబ్బందులు లేకుండా చేయాల్సినవసరం ఉందని, దానికోసం టిడిపి పోరాడుతుందని చెప్పారు. అందుకే పోలవరం ప్రాజెక్టు టెండర్లు వెంటనే రద్దు చేసి తిరిగి టెండర్లను పిలిచి, అనుభవజ్ఞులకు ఇవ్వాలని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!