బుధ‌వారం తెలంగాణలో వైన్స్‌ బంద్‌


తెలంగాణ జెఎసి నేతలు ఒక విమర్శను ఎదుర్కుంటున్నారు.తెలంగాణ సమ్మెలో మద్యం షాపులను ఎందుకు మినహాయించారని, అవి బంద్ కాకపోయినా ఎందుకు ఊరుకుంటున్నారని మంద కృష్ణ మాదిగ వంటి వారు ప్రశ్నిస్తుంటారు. వారికి సమాధానంగా అన్నట్లు బుధవారం నాడు మద్యం షాపుల బంద్ జరపాలని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ పిలుపు ఇచ్చారు. బంద్ అన్ని షాపుల వారు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రంగారెడ్డి,హైదరాబాద్ మద్యం షాపుల యజమానుల సంఘం ఈ విషయమై నిర్ణయం తీసుకుందని, దీనిని తెలంగాణ జిల్లాల వారంతా బలపరచాలని ఆయన కోరారు. సమ్మెలో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయని, తెలంగాణ వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా గురుకుల పాఠశాలల జెఎసి సమ్మె నుంచి విరమించుకుని విధులకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. అయితే ఇంటర్ లెక్చరర్ల జెఎసి మాత్రం తెలంగాన జెఎసి నిర్ణయం ప్రకారం నడుచుకుంటుందని మంత్రి పార్ధసారధికి తెలియచేసింది.ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ కోదండరామ్,కెసిఆర్ లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వారు తమ వ్యక్తిగత ఎజెఎండాను తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. కాగా సామాన్య ప్రజల నుంచి వచ్చిన ప్రతిఘటన వల్లనే సమ్మె విరమణలు జరుగుతున్నాయని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా టిఆర్ ఎస్ నేత హరీష్ రావు ఇకపై తమ టార్గెట్ రాజీనామా చేయని మంత్రులేనని ప్రకటించారు.ఈటెల రాజేందర్ జైలు నుంచి విడుదల కాగానే పాలిట్ బ్యూర్ సమావేశం జరిపి భవిష్యత్తు కార్యాచరణను తయారుచేస్తామని అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!