విశాలాంధ్ర మహాసభకు అనుమతి నిరాకరణ
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాలాంధ్ర మహాసభ నిర్వహించ తలపెట్టిన వర్క్ షాప్ కు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. జూబ్లి హాలులో ఈ మహాసభ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం పరకాల ప్రభాకర్ ప్రకటించారు.మీడియా సమావేశంలోనే రభస సృష్టించడానికి కొందరు ప్రయత్నించారు.పోలీసులు జోక్యంతో అది సద్దుమణిగింది. ఏకంగా వర్క్ షాప్ అంటే వచ్చే సమస్యలు,కొందరు తెలంగాణ వాదులు మళ్లీ ఉద్రిక్తత సృష్టించడానికి అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సర్దుకుంటున్నాయని, అలాగే సమ్మెలు తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో భావోద్వేగాలు పెరిగేలా సదస్సు నిర్వహించడం మంచిదికాదని పోలీసులు అభిప్రాయపడి అనుమతి నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కేవలం తెలంగాణవాదానికి సంబంధించిన సదస్సులకు మాత్రం అనుమతి ఇచ్చి,రెండోవాదానికి అవకాశం ఇవ్వకపోవడం కాస్త ఇబ్బంది కరమే అయినా పరిస్థితులను బట్టి పోలీసులు వ్యవహరించారని అనుకోవాలి. అంతేకాక తెలంగాణ రాష్ట్రం కోరుకునే వారు మరో వాదన హైదరాబాద్ లో వినిపించకూడదని భావించడం కూడా ప్రజాస్వామ్యయుతంగాదు. అయినా ఇప్పుడు ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అని చెప్పాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి