లిబియా నియంత గడాఫీ హతం?


లిబియా నిరంకుశ పాలకుడు గడాఫీ హతమయినట్టు అంతర్జాతీయ, స్థానిక మీడియా వెల్లడించింది. ఉద్యమకారులు, నాటో దళాలు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్టు తెలిపింది. గడాఫీ మరణవార్తను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 1969 నుంచి 2011 వరకు లిబియాలో గడాఫీ నియంతృత్వ పాలన సాగించారు.  గడాఫీ మరణవార్త వినగానే లిబియా ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. గడాఫీ సొంత పట్టణం సిర్త్‌పై నాటో దళాలు, ఉద్యమకారులు సంయుక్తంగా దాడి చేశారు. బంకర్‌లో దాగివున్న ఆయనపై కాల్పులు జరిపారు. రెండు కాళ్లకు గాయాలయిన గడాఫీ తనను కాల్చవద్దని చివరి మాటలుగా పలికినట్టు మీడియా పేర్కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!