నాయ‌కులంద‌రూ పోలీస్‌స్టేష‌న్ల ల‌లో..


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పొలిటికల్ జేఏసీ చేపట్టిన రైల్‌రోకో ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచే తెలంగాణ వాదులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెలు పట్టాలపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. అయితే డీజీపీ ముందుగా చెప్పిన విధంగానే నేతలను పట్టాలపై రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
హైదరాబాద్ సీతాఫల్ మండిలో రైల్‌రోకో నిర్వహిస్తున్న కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -మౌలాలిలో పట్టాలపై బైఠాయించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరె స్ట్ చేసి కీసర పీఎస్‌కు తరలించారు.
- లక్డీకాపూల్‌లో రైల్‌రోకో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
-బర్కత్‌పూరలో రైల్‌రోకో పాల్గొనడానికి వెళ్తున్న టీఆర్ఎస్ నేత నాయినిని పోలీసులు అరెస్ట్ చేసి ఫలక్‌నుమ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
* మెదక్ : జిల్లాలోని అక్కన్న పేట రైల్వే స్టేషన్‌పై బైఠాయించిన మాజీ ఎమ్మెల్సీ సత ్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
-పెద్ద సంఖ్యలో అక్కన్న పేట రైల్వే స్టేషన్‌కు పాదయాత్రగా వెళ్తున్న టీఆర్ఎన్ ఎమ్మెల్యే హరీష్ రావు ను పోలీసులు అరెస్ట్ చేశారు.
* మహబూబ్‌నగర్ : జిల్లాలోని జడ్చర్లలో పట్టాలపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు.
* వరంగల్ : జిల్లాలోని హసన్‌పర్తిలో రైల్‌రోకోలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాజయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రైల్వేయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముందస్తు జాగ్రత్తగా గృహనిర్భందం చేశారు.
* హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహిస్తున్న సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మౌలాలి రైల్వే స్టేషన్‌లో రైల్‌రోకో చేస్తున్న విమలక్క, సంధ్య అరెస్ట్.
* నల్గొండ జిల్లాలో భువనగిరిలో రోడ్డుపై బైఠాయించిన కేకే, కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* నిజామాబాద్‌లో రైల్‌రోకో చేస్తున్న ఎంపీ మధుయాష్కిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!