సి.ఎం.ని టి-ప్రజ‌లు స‌హించ‌రు..


ఇప్పటికే మంత్రిగా రాజీనామా చేసిన తాను అవసరమైతే పార్టీని కూడా వదలుకోవడానికి సిద్దమేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చేస్తున్నదని, తెలంగాణ ప్రజలు తిరగబడతారని, ముఖ్యమంత్రిని ఉరికిస్తారని తీవ్రంగా అన్నారు.కరీంనగర్ వెళ్లి అరెస్టు అయిన ఎమ్.పి పొన్నం ప్రభాకర్ ను వారు పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సీనియర్ నాయకుడు కె.కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం విప్లవంగా మారుతుందని హెచ్చరించారు. మరో ఎమ్.పి వివేక మాట్లాడుతూ ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాగర్ కర్నూల్ ఎమ్.పి మందా జగన్నాధం మాట్లాడుతూ తాము మూడునెలల క్రితమే తమ పదవులకు రాజీనామా చేశామని, వాటిని ఆమోదించాలని ఒత్తిడి చేస్తున్నామని అన్నారు. కాగా టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తో టిఆర్ఎస్ మాచ్ ఫిక్సింగ్ చేసుకుని వ్యవహరిస్తున్నదని అన్నారు. తాము కూడా ఉద్యమంలో కలిసి వస్తామని చెబితే ఎందుకు అంగీకరించడం లేదని టిజెఎసిని ఆయన ప్రశ్నించారు.కాగా తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకి కాలం చెల్లిందని కోమటిరెడ్డి వేరే సందర్భంలో వ్యాఖ్యానించడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!