భూమికి పొంచి వున్న ముప్పు..


అంతరిక్షం నుంచి మరో భారీ ఉపగ్రహం భూమివైపు దూసుకొస్తోంది. మరో వారంలోగా అది ఏ క్షణంలోనైనా భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చు! జర్మనీకి చెందిన 2.4టన్నుల బరువున్న రాంట్జన్ శాటిలైట్(రోశాట్) అక్టోబర్ 21 నుంచి 25లోపు ఎప్పుడైనా కూలే అవకాశం ఉందని జర్మన్ అంతరిక్ష శాస్త్రజ్ఙులు తెలిపారు. అంతరిక్షాన్ని పరిశీలించడానికి 1990లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం 1998 నుంచి పనిచేయడం మానేసింది. గత నవంబర్‌లోనే రోశాట్ కూలుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత దాన్ని సవరించుకున్నారు. ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ముక్కలవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే, వాటిలో 1.7 టన్నుల బరువుండే దాదాపు 30 గాజు పలకలు, కొన్ని సిరామిక్ ముక్కలు భూమిని తాకొచ్చని తెలిపారు. అవి భూ వాతావరణంలోకి రాగానే రాపిడితో పుట్టే వేడిని తట్టుకునే అవకాశముందన్నారు. ఈ శకలాలు ఏ ప్రాంతంలో పడతాయో చెప్పలేమని, రెండు గంటల ముందు మాత్రమే ప్రాంతాన్ని గుర్తించగలమంటున్నారు. రెండు వేల అవకాశాల్లో ఒకసారి మాత్రమే ఈ శకలాలు జనావాసాల్లో పడే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసాయూఏఆర్ఎస్ శాటిలైట్ గత నెలలో పసిఫిక్ మహా సముద్రంలో పడిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!