తెలంగాణ ప‌రిష్కారానికి ఇదే మార్గమా..?


కేంద్ర ప్రభుత్వం , కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నది. తాజాగా మళ్లీ అభివృద్ది ప్యాకేజీ లను ఇవ్వాలన్న ప్రతిపా దనను పరిశీలిస్తున్నదని కధనాలు వస్తు న్నాయి.దీనిని శాశ్వత పరిష్కారం అని ప్రకటించకుండా, మధ్యంతర ప్యాకేజీగా ప్రకటిస్తారు. దీని ప్రకారం కేంద్రం ప్రకటించే అభివృద్ది ప్యాకేజీలో నిధులు సగం తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయడానికి కేటాయిస్తారు.మిగిలిన సగం నిధులను కోస్తా, రాయల సీమలకు కేటాయిస్తారు. ఈ నిధుల ఖర్చుకు అన్ని పార్టీలతో కూడా ప్రతినిధులతో కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ పర్యవేక్షణలో నిధులను వ్యయం చేయాలని ఈ ప్రతిపాదన చెబుతోంది. దీనిపై ముఖ్యమంత్రి, పిసిసి అద్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారని ఎఐసిసి వర్గాలు వెల్లడిస్తున్నాయని కధనాలు వస్తున్నాయి.అయితే దీనితో తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోయినట్లు కాదని, అయితే కొంత ఉపశమనం కలిగించడమే దీని ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నప్పట్టికీ, ముందుగా దీనిని అమలు చేస్తే ప్రయోజనం కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. ఈ లోగా ఉద్యమ తీవ్రత, కాంగ్రెస్ లో ఉన్నడిమాండ్ వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయాలు చేసే అవకాశం ఉంటుంది.అంతేకాక ఎంత మొత్తం నిధులుఇస్తారన్నది కూడా ముఖ్యమైన విషయంగా ఉంటుంది.ఈ ప్రయోగం ఒక రకంగా మంచిదే. కాని ప్రత్యేక రాష్ట్రమే కావాలని డిమాండ్ చేస్తున్న వారికి ఇది రుచించదు. దీనిని వారు ఒప్పుకుంటారని అనుకోజాలం. అయితే కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఒప్పుకున్నా కేంద్రం దీనిపై ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!