ఇంగ్లండ్ పై భార‌త్ ఘ‌న‌విజ‌యం



ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత జట్టు చేజిక్కించుకుంది. 299 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను చేపట్టిన భారత జట్టు ఇంకా నాలుగు బంతులుండగానే విజయం సాధించింది. కెప్టెన్ ధోని 35, జడెజా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. యువ ఆటగాడు రహానే రాణించి 91 పరుగులు చేశాడు. గంభీర్ 58, పార్థీవ్ 38, కోహ్లీ 35 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్, బ్రెస్ననన్ రెండు వికెట్లు, స్వాన్ ఒక వికెట్ పడగొట్టారు. భారత విజయంలో కీలక పాత్రను పోషించిన రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 298 పరుగులు చేసింది. ట్రాట్, పటేల్, పీటర్సన్‌లు రాణించడంతో భారీ స్కోరును భారత్ ముందుంచింది. ట్రాట్ 98, పటేల్ 70, పీటర్సన్ 64, కీస్వెట్టర్ 36, బొపారా 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రవీణ్, వినయ్, కోహ్లీ, జడెజాలు చెరో వికెట్ పడగొట్టారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!