వ్యతిరేక‌త వ‌ల్లే స‌మ్మె విర‌మ‌ణ‌


‘‘ఉద్యోగులు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే గతి లేక కోదండరాం సంఘాల చేత సమ్మె విరమణ చేయిస్తున్నారు. సమ్మెతో తెలంగాణ రాదన్న కనువిప్పు కలిగినందునే విరమణ చేస్తూ ప్రకటన చేస్తున్నారు’’ అని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ప్రతిఘటన దృష్ట్యానే ఆర్టీసీ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మె నుంచి వైదొలిగాయని చెప్పారు. లగడపాటి ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై ఈ నెలాఖరులోగా లేక నవంబర్ మొదటి వారానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పే అవకాశాలున్నాయని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణపై తమ నిర్ణయాన్ని చెప్పని టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు సైతం తమ వైఖరిని స్పష్టం చేస్తే కాంగ్రెస్ ఓ నిర్ణయానికి రావచ్చన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!