లెక్షర‌ర్‌గా ప్రిన్స్‌



మహేష్ ఇప్పుడో కొత్త తరహా గెటప్‌లో కనిపించబోతున్నాడు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీలోలో ఇప్పటి వరకూ నటించని మహేష్‌.. స్టూడెంట్‌గా కాకుండా ఏకంగా లెక్చరర్‌గానే ఎంట్రీ ఇస్తున్నాడు. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం దూకుడు స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్‌బాబు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో బిజినెస్‌మాన్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తవ‌గానే వెంట‌నే లెక్షర‌ర్ పాత్రలో మ‌హేష్ చేయ‌నున్నాడు. సుకుమార్ క‌థ‌ల‌ని ఎంత సున్నితంగా డీల్ చేస్తాడో అంద‌రికీ తెలిసిందే.. మ‌రి.. ప‌క్కా మాస్ మ‌సాలా చిత్రాల‌లో క‌నిపించే మ‌హేష్‌ని లెక్షర‌ర్‌గా ఎలా తీర్చిదిద్దనున్నాడో అని ఇప్పటినుండే మ‌హేష్ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!