భార‌త క్రికెట్ అభిమానుల‌కి దీపావ‌ళి కానుక‌


భార‌త‌క్రికెట్ అభిమానుల‌కి ఒక రోజు ముందుగానే దీపావ‌ళి వ‌చ్చింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదు వండేలనీ గెలిచి క్లీన్‌స్వీప్‌తో సిరీస్‌ని సొంతం చేసుకుంది. దీనితో ఇంగ్లండ్‌పై క‌సి తీర్చుకోవ‌డ‌మే కాకుండా కోట్లాది మంది భార‌త క్రికెట్ అభిమానుల‌కి దీపావ‌ళి కానుక‌గా ఈ విజ‌యాన్ని ధోని సేన స‌గ‌ర్వంగా స‌మ‌ర్పించింది..
ఊహించినట్టే ఇండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ 176 పరుగులకే ఆల్ ఔట్ కావడంతో ఇండియాకు ఘనవిజయం లభించింది. 95 పరుగుల తేడాతో ఇండియా ఐదవ ఔన్ డే గెల్చుకుని సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. తొలుత ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేయగా, ఇంగ్లండ్ అందుకు మొదట అద్భుతమైన సమాధానం చెప్పింది. 129 పరుగులవరకు ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా నష్ట పోకుండా బ్రహ్మాండంగా ఆడిందని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసించారు.
కుక్ 60 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాలు ప్రారంభమయ్యాయి. మరి ఐదు పరుగులకు క్రేగ్‌ను జడేజా ఎల్.బి.డబ్ల్యు ద్వారా ఔట్ చేయడంతో కలకత్తాలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. అప్పటికి క్రేగ్ 64 బంతులలో 63 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వికెట్లు టపటప పడిపోయాయి. కెప్టెన్ ధోని 75 పరుగులతో ఇండియా గెలుపునకు మార్గం సుగమం చేస్తే, జడేజా నాలుగు వికెట్లు తీసి ఇండియాకు అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టారు.
ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయేవరకూ ఈ మ్యాచ్‌లో మాత్రం విజేత ఇంగ్లండేనని అందరూ భావించారు. అయితే 129 పరుగుల వద్ద మొదటి వికెట్, 134 పరుగుల వద్ద రెండవ వికెట్, 137 పరుగుల వద్ద మూడు, నాలుగు వికెట్లు పడిపోవడంతో ఇండియా విజయం తథ్యమైపోయింది. 141 పరుగుల వద్ద 5 వికెట్ పడిపోగా, 176 పరుగులకు ఆల్ ఔట్ అయ్యారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!