స‌మ్మెపై కేసీఆర్ మౌనం వెనుక‌..?


తెలంగాణ లో సకల జనుల సమ్మెలో పాల్గొన్న వివిధ ఉద్యోగ సంఘాలు ఒక్కక్కటిగా విరమించుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఒక్కసారి కూడా స్పందించలేదు.దీనిపై అప్పుడే విమర్శలు కూడా ఆరంభమ య్యాయి.అయితే పార్టీలో అంతర్గత సమావేశాలలో కెసిఆర్ ఈ విషయాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన భావాలు ఎలా ఉంటున్నాయన్నది తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.టిఆర్ఎస్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కెసిఆర్ సమ్మె విరమణపై “గోడకు కొట్టుకోలేం కదా’ అని వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయాన్ని బయటకు ప్రకటించలేరు కదా అని టిఆర్ఎస్ నాయకుడు ఒకరు అన్నారు. అయితే ఇప్పటికీ కెసిఆర్ తెలంగాణపై కేంద్రం ఏదో ఒక ప్రకటన చేస్తుందని నమ్ముతున్నారని టిఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కు ముడి పెట్టి అయినా కేంద్రం ప్రకటన చేస్తుందని ఆయన నమ్మారని అందువల్లనే ఉద్యోగ సంఘాలు సమ్మెను కొనసాగించాలని కోరుతూ వచ్చారని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈలోగా టీచర్ల జెఎసి తెలంగాన జెఎసితో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వెళ్లడంతో ఇబ్బంది వచ్చిందని , దానిని సరిచేసుకోవడం కోసం తెలంగాణ జెఎసి వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చిందని వివరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కెసిఆర్ కూడా ఎవరిని ఏమీ అనలేని స్థితిలో పడ్డారని , అందువల్లనే ఆయనకు ఏదో ఒక మూల ఇంకా తెలంగాణకు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తుందన్న ఆశ మిణుకుమిణుకుమంటున్నా, తప్పని సరి పరిస్థితిలో ఆయన గోడకు కొట్టుకోలేం కదా అని సమ్మె విరమణపై సరిపెట్టుకుంటున్నారని చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!