కేసీఆర్ బినామీకే పోల‌వ‌రం టెండ‌ర్‌


పోలవరం టెండర్ వ్యవహారంతో కెసిఆర్ లింకు పెట్టి ఆయనను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది.మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నమస్తే తెలంగాణ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాజం వాటాదారుడిగా ఉన్న ఎస్.ఇ.డబ్ల్యు. కనస్ట్రక్షన్స్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు టెండర్ రావడంలో కెసిఆర్ ప్రమేయం ఉందని , ఇది కెసిఆర్ బినామీకే దక్కిందని ఆరోపించారు. దానిని టిఆర్ఎస్ నేతలు ఖండించినప్పట్టికీ, ఎస్.ఇ.డబ్ల్యు. లో రాజం కు మూడు శాతం వాటానే ఉందని ఒప్పుకున్నారు.అయితే పోలవరం పై తమ వైఖరి మారలేదని, చంద్రబాబు వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.దానికి కొనసాగింపుగా శుక్రవారం నాడు సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై ఆరోపణల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చడానికి కెసిఆర్ పోలవరం టెండర్ ద్వారా మేనేజ్ చేసిందని ఆరరోపించారు.కెసిఆర్ బలహీనతను కాంగ్రెస్ వాడుకుందని , పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాను భారీగా పెంచిందని ఆయన అన్నారు.సకల జనుల సమ్మెను సకల ఉద్యోగుల సమ్మెగా మార్చింది కెసిఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. టెండర్లలో వచ్చిన డబ్బును అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్లు దండుకుంటున్నారని, ఈ ఆరోపణలపై కెసిఆర్ స్పందించాలని దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.పోలవరం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్దమా అని ఆయన సవాలు విసిరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!