ఎన్‌.టి.ఆర్‌కి, కిర‌ణ్‌కుమార్‌కి మ‌ధ్య పోలిక‌..


విశ్వవిఖ్యాత‌న‌ట‌సార్వభౌముడు, దివంగ‌త ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు గారికి, ప్రస్తుత ముఖ్యమంత్రికి ఒక పోలిక కుదిరింది.. ఈ పోలిక యాధృశ్చిక‌మే అయినా కిర‌ణ్‌కుమార్‌కి ఈ పోలిక కుదిరింది.. ఇంత‌కీ ఏమిటా పోలిక అనే క‌దా.. అల‌నాడు తొమ్మిది నెల‌ల్లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి రికార్డు సృష్టించారు ఎన్‌.టి.ఆర్‌. గారు.. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టకుండా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అదే కోవ‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి చేరారు. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టకుండా, స్పీక‌ర్‌గా ప‌ద‌వీ బాధ్యత‌లు నిర్వహించిన కిర‌ణ్‌కుమార్ రెడ్డి అధిష్టానం చ‌ల‌వ వ‌ల‌న నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టకుండా ముఖ్యమంత్రి అయిన రెండ‌వ వ్యక్తిని తానేన‌ని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రక‌టించారు. మంత్రిగా పనిచేయకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఎన్‌టి రామారావు, తాను మాత్రమేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పీలేరులో ఓ సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ ఆ పోలిక తెచ్చుకున్నారు. మొత్తానికి ఈ విష‌యంలో ఎన్టీఆర్‌తో పోలిక కుదిరినందుకు ముఖ్యమంత్రి తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నట్టు ఆయ‌న ప్రక‌ట‌న ద్వారానే తెలిసిపోతుంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!