జపాన్ రేడియేషన్ ఇండియాకు వచ్చేస్తోందా?

 జపాన్ లో అణువిద్యుత్ కేంద్రాలు ఒకొటొకటిగా పేలిపోతున్నాయి. దీంతో ప్రమాదకర స్థాయిలో రేడియేషన్ దూసుకువచ్చేస్తోంది. ఇది ప్రస్తుతానికి అమెరికా వైపు వెళుతున్నట్టు చెబుతున్నా, మనదేశానికి కూడా ముప్పు రావచ్చనే అంటున్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షం పడితే, రైన్ కోట్, రైన్ హ్యాట్ లేకుండా బయటకు వెళ్లవద్దంటూ సెల్ ఫోన్లలో సంక్షిప్త సందేశాల రూపంలో హెచ్చరికలు కనిపిస్తున్నాయి. జపాన్ లోని టోక్యో దగ్గర ఇప్పటికే, 400 మిల్లీసీవెర్ట్స్ మేరకు రేడియేషన్ వ్యాప్తి చెందుతోంది. ఇది సాదారణ స్థాయికంటే, తొమ్మిది రెట్లు ఎక్కువ. ఈ స్థాయి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. 350 మిల్లీ సీవెర్ట్స్ స్థాయిలో ఉంటే, ఆ ప్రాంతంలోని జనవాసాలను ఖాళీ చేయించాలని ప్రపంచ న్యూక్లియర్ అసోసియేషన్ చెర్నోబిల్ సంఘటన తరువాత హెచ్చరించింది. జపాన్ లో ప్రస్తుతానికి ఆ స్థాయి దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో అణుధార్మికత  మనుషులపై ఎలాంటి దుష్ప్రభావం కలిగిస్తుందో చూద్దాం...
  మానవాళిని నరనరాన తినేసే మహమ్మారి అణు ధార్మికత. దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితం… జపాన్‌ నగరాలు హిరోషిమా, నాగసాకిలలో… అమెరికా పేల్చిన అణుబాంబుల ప్రభావం… నేటికీ కనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత అమెరికాలోని త్రిమైల్‌ ఐలెండ్‌లోని అణువిద్యుత్కేంద్రంలో 28 ఏప్రిల్‌ 1979వ తేదీన ప్రమాదం జరిగింది. 24 ఏళ్ళ క్రితం అంటే 26 ఏప్రిల్‌ 1986వ తేదీన రష్యా అణు విద్యుత్కేంద్రం చెర్నోబిల్‌లో సంభవించిన ప్రమాదం గురించి చెప్పనలవికాదు. దాని ప్రభావం వల్ల వేలాది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో అణుదార్మికత ప్రభావం బారిన పడి చనిపోయిన వారి గురించిన పూర్తి స్థాయి లెక్కలు లేనేలేవు.
అంతేకాదు. అణుదార్మికత ప్రభావం వల్ల ఐదారంగుళాల పొడవున్న పిల్లలు, కాళ్ళు, చేతులు, ముక్కు ముఖం ఒకటేంటి అష్ట వంకర్లతో కూడిన పిల్లలు పుడుతున్నారు. హిరోషిమా, నాగసాకీ, త్రీమైల్‌ ఐలెండ్‌, చెర్నోబిల్‌.. పేరేదైనా.. ప్రాంతం ఎక్కడిదైనా… అన్ని ఘటనలూ మానవాళిని, జీవావరణాన్ని నాశనం చేసినవే. అణుధార్మికత వల్ల ప్రజలకు సంక్రమించిన రుగ్మతల్ని సమూలంగా ఏ దేశమూ నివారించలేక పోయింది. అణ్వాయుధ ప్రయోగం ఆధిపత్య పోరులో భాగమైతే… రష్యాలోని చెర్నోబిల్‌, అమెరికాలోని త్రిమైల్‌ ఐలండ్‌ల్లోని అణు విద్యుత్కేంద్రాల్లో జరిగిన ప్రమాదాలు పూర్తిగా మానవ తప్పిదమే.
ఇటువంటి పరిస్థితుల్లో భారత తీర ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చెసేందుకు తలపెట్టిన అణువిద్యుత్కేంద్రాల గురించి వివరించేందుకు జులై 2న ఉదయం 10 గంటలకు ద్వారకానగర్‌లోని పౌర గ్రంధాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భారతదేశంలోని ప్రముఖ న్యూక్లియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సురేంద్ర గడేకర్‌, రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ, ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య రాష్ట్ర కో కన్వీనర్‌ కవుల సరస్వతి తదితరులు అణు విధ్వంసాన్ని గురించి వివరిస్తారు.
మన కళ్ల ముందే… మనకు తెలిసిన కాలంలోనే ఇంత ఘోరాతిఘోరమైన హనన కాండ జరిగిపోతే… భారత దేశంలోని పాలకులు మాత్రం గాంధారీ వ్రతాన్ని పాటిస్తున్నారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని… లేని గుడ్డితనాన్ని అనుభవిస్తూ… ‘అణు విచ్చేదనం ద్వారా పారిశ్రామిక అవసరాలకు విద్యుత్తు ఉత్పత్తి చేస్తాం” అని చాటుకోవడం అన్యాయం. ”ఆటమిక్‌ పవర్‌ కోసం వెంపర్లాడడం… ఆటవిక న్యాయాన్ని అమలు చేయడంతో సమానం” ఆంధ్రప్రదేేశ్‌లో ఇదే రీతిలో పాతికేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం వద్ద అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపించిన తర్వాత పాలకులు వెనకడుగేశారు.
తర్వాత నాగార్జున సాగర్‌ వద్ద చేసిన అణు విద్యుత్కేంద్ర సన్నాహాలను జనం తిప్పి కొట్టారు. కాని పాలకుల్లో మార్పు రాలేదు. మరలా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం వద్ద అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేసి అమెరికాలోని త్రిమైల్‌ ఐలెండ్‌, చెర్నోబిల్‌ తరహాలో చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వంతపాడుతున్నారు.
యురేనియం ద్వారా విభిన్న ప్రయోజనాలు పొందాలనే వెంపర్లాటలో సాగించే పరిశోధనలే ప్రాణాంతకం.
వాటివల్ల ఎగసిపడే అణు వ్యర్థాలు, ధూళి, అణు ధార్మికత వల్ల కలిగే ప్రమాదాలు ఊహించనలవి కాదు. అణు ధార్మికత విషయానికి వస్తే ఇది కంటికి కనపడని, రంగు, రుచి, వాసనలేని అదృశ్య శక్తి. ఇలాంటిది ఒకటుందని తెలియకుండానే మనుషుల్ని, పశుపక్ష్యాది జీవజాలాన్ని, చివరకు చెట్టు పుట్టలనుకూడా పొట్టనబెట్టుకుంటుంది.అణు ధార్మికతను కలిగించే ఖనిజాలను, పదార్థాలను అన్వేషించి… ప్రపంచానికి చాటి చెప్పిన మహిళా శాస్త్రవేత్త మేడం క్యూరీ. ఆమెనే ఈ అణుధార్మికత బలిగొంది.
 16 జూలై 1979లో అమెరికాలో న్యూమెక్సికోకి చేరువలోని చర్చ్‌రాక్‌ అనే ప్రాంతంలో యురేనియం టైలింగ్‌ పాండ్‌ గండిపడింది. అణు వ్యర్థాలు వచ్చి ప్యూరికో నదిలో కలిసిపోవడం వల్ల జరిగిన నష్టం వర్ణనాతీతం. ఏడాదిన్నర తిరిగేసరికి ఆ నది కాలుష్య ప్రభావం ప్రభుత్వానికి తెలిసొచ్చింది. వెంటనే ఆ నీటిని వాడవద్దని ప్రజల్ని హెచ్చరించి… నదిని శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టింది. అమిత వ్యయంతో చేపట్టిన ఈ ప్రక్షాళన సుదీర్ఘ కాలం సాగింది. అమెరికా వంటి దేశమే తమ వద్ద ఉన్న అణువ్యర్థాలను ఎక్కడ నిక్షిప్తం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతుంది.
అణు విద్యుత్కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాలు లక్షల సంవత్సరాలు అణుధార్మికత కలిగి ఉంటాయి. అత్యంత ఖర్చుతో వీటిని అన్ని సంవత్సరాలు నిక్షిప్తం చెయ్యడమనేది సాధ్యమయ్యే పనేనా? ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో రసాయన పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్థాలవల్లే మానవాళికి జరుగుతున్న నష్టమే చెప్పనలవికాకుండా ఉంది. దానికి అణువిద్యుత్తు కేంద్రాలు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.
భారత దేశంలో భోపాల్‌ దుర్ఘటన జరిగి… పాతికేళ్లు దాటింది. బాధిత కుటుంబాలకు జరిగిన న్యాయం ఏపాటితో జగద్వితితమే. ”అణు విద్యుత్తు, పరిశోధనా కేంద్రాల్లో ప్రమాదాలు సంభవిస్తే కలిగే నష్టాన్ని ఎవరు పూడ్చగలరు. రేపటి తరానికి ఎవరు జవాబుదారీ వహిస్తారు” అన్న ప్రశ్నలకు జవాబేది.
ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను బలిపెడుతూ బహూళజాతి సంస్థల ప్రతినిధులకు వంతపాడుతూ కోస్టల్‌ కారిడార్‌, వేన్‌పిక్‌, పిసిపిఐఆర్‌లో వచ్చే రసాయన పరిశ్రమలకు కారుచౌకగా కరెంటు సరఫరా చేయడానికే… అణు విద్యుత్కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.
రేపటి జీవితం ఎంత దుర్భరంగా మారబోతుందో… మన కళ్లెదురుగానే ఒక హిరోషిమాలా… ఒక నాగసాకిలా…
ఒక చెర్నోబిల్‌లా… అమెరికాలోని త్రిమైల్‌ ఐలాండ్‌లా… మరో భోపాల్‌లా… మన ప్రాంతం మారకముందే ప్రతి ఒక్కరూ స్పందించండి.

కామెంట్‌లు

  1. i think govt officers and political leaders has huge margin on this projects, thats why they are agreed for this nuclear reactors power.
    they will not bother about people health and environment etc.,

    రిప్లయితొలగించండి
  2. "... జపాన్ లో అణువిద్యుత్ కేంద్రాలు ఒకొటొకటిగా పేలిపోతున్నాయి..." This is factually wrong. No reactor exploded in Japan. The explosions had taken place in the cooling apparatus.

    Its true that using Nuclear Energy for producing electricity is quite risky. Its better that Governments concentrate on making electricity from Solar Energy which is plentiful in India. Its surprising why this source is so far by and large ignored in our Country.

    రిప్లయితొలగించండి
  3. "It would be a great tragedy,if sunrise of technology were to be the sunset of mankind"
    -yvsn Sharma.

    రిప్లయితొలగించండి
  4. మీ రాతల్లో కొంచెం అతి ఉంది గురువుగారూ. for your information, ఇపుడు నేను టోక్యో లోనే ఉన్నాను. ఫుకుషిమా లో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా, దానిని అదుపు చేయటానికి ఆ కంపెనీ వారు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. I am sure they will control the situation in few weeks. టోక్యో లో ఎపుడూ ఉండేదానికన్నా కొంచెం ఎక్కువ రేడియేషన్ ఉంది, అంతేగాని అది ఇంకా ప్రమాదకర స్థాయిని చేరలేదు.
    మన దేశానికి ఇపుడు కాకపోయినా భవిష్యత్తులో అణు విద్యుత్ తప్పక అవసరం. ఎందుకంటే వందకోట్ల జనాభా దాటిన మన దేశ అవసరాలకు తగినంత శక్తి ఇప్పటికీ అందుబాటులో లేదు. అణు విద్యుత్ కేంద్రాలపై భయపడటం కాదు, ప్రమాదాలు జరగకుండా ఉండేలా కర్మాగారాలు నిర్మించాలి. ఆ పని మన కంపెనెలు చిత్తశుధ్ధితో చేయగలిగితే అదే గొప్ప దేశ సేవ. భవిష్యత్తులో ఉండబోయే ఈ అణువిద్యుత్ కర్మాగారాలకు సరిపడా సమర్థవంతమైన ఇంజినీర్లను మనం తయారు చేయాలి. అందుకోసం విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, ప్రభుత్వం తమవంతు కృషి చేయాలి.
    "అణువిద్యుత్ అంటే నాశనం , థర్మల్ పవర్ ప్లాంట్ అంటే భయం" అనుకుంటే ఉచిత విద్యుత్ కి, ఫ్రీగా వచ్చే కలర్ TV లకి ఆశపడి ఒటేయడం మానేయాలి మరి. ఈ విషయం లో జపాన్ వాల్లు కొంత బెటర్. ఓ పక్క సునామీ, పవర్ ప్లాంట్ సమస్యలతో బాధపడుతున్నా, సగటు పౌరులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. మనమూ మన భయాలను విడిచిపెట్టి బాధ్యతాయుతంగా పని చేద్దామా? అపుడు మనం ఏ ఫాక్టరీ కట్టినా అది అన్నిటినీ తట్టుకుని నిలబడగలుగుతుంది.

    రిప్లయితొలగించండి
  5. Ha how did I miss this.

    Surya - CLAPS!!

    Dear Blog Owner-> In last 50 years, there was only one nuclear reactor accident, which killed people, and that was Chernobyl. All other accidents, including 3mile island, didn't involve any loss of human life.

    The Chernobyl reactors were designed using pre-1980 technology, and were poorly designed. The technical design with strong leak containers, coupled with safety procedures and layers have come long way after Chernnobyl incident.

    Just to put things into perspective, there are more deaths in road accidents in one year across the country, than number of deaths in last 50 years from nuclear reactor accidents.

    If you were to go by statistics, which doesn't mean much as I will readily admit, the riskiest thing that an average citizen does is to get in a car and drive or board a train!! Seriously!!

    So, calm down, don't get panic or worse, plese don't spread misinformation.

    It would be extremely foolish to take the Nuclear option off the table for India's energy needs, citing what happened in Japan.

    Having said that, no technology is fool-proof. Ofcoure there will be accidents in future. You just need to put in systems in place, learning from previous experiences.

    I would rather argue that, India will be taking more risk if they put off nuclear energy as one of the sources, than by not going through that route.

    Thanks,
    Please stop paying attention to losers. These communists always create some high decibal noise. Put them where they belong i.e., attention-seekers.

    రిప్లయితొలగించండి
  6. This country has no short term plan and chance than relaying on Nuclear energy. So there is no question whether to use it.

    I heard about solar energy decades back but it never become popular. That is because of technical problems that industry facing. As of now, generating solar energy is so much costly.

    If you say no to nuclear energy, then you are killing this country's future. As many people said in above posts, there are risks in using it. But what can we do? Can we power down all the country and put a stop for development...!

    రిప్లయితొలగించండి
  7. @ch.brahmanandam : I don't think margins play any role in getting Nuclear energy to India. This is the decision which keeps current development movement in india.

    But in future Govt. Official and contractors may get huge profit over these Nuclear plants. It used to happen in every industry.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!