ఉపవాసం అంటే...?

శివరాత్రికి మనలో చాలామంది ఉపవాసం ఉంటున్నారు. అయితే శివారాధనలో ఉపవాసం అవసరమా? అసలు ఉపవాసం అంటే ఏమిటి?
దేవదేవునికి అత్యంత సమీపంలో వసించడమే (ఉండటమే) ఉపవాసం. అలా ఉన్నప్పుడు ఇంద్రియసుఖాలను మరచిపోతాం. ఆహారం తీసుకోవాలన్న ధ్యాసే ఉండదు. అసలు ఆహారం అంటే, నోటితో తినే పదార్ధాలుమాత్రమేకాదు. ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే ఉపవాసం. భోగమైన ఆనందాన్ని విడిచిపెట్టి, యోగానందాన్ని అనుభవించడమే ఉపవాసం. శివజ్యోతిని సాక్షాత్కరింపజేసుకుని ఆత్మజ్యోతిని మిళితం చేయడమే ఉపవాస పరమార్ధం.
- తుర్లపాటి నాగభూషణ రావు
   98852 92208


కామెంట్‌లు

  1. ధార్మికవిషయాలపై చర్చలకు ఉద్దేశించిన వందేమాతరం గుంపులో మీరు చేరాలని మాకోరిక.

    లింక్
    https://groups.google.com/group/vandemaatulam?hl=en

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!