మనకంత సీన్ ఉందా??

అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం పర్యవసానంగా నిర్మాణమయ్యే అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే బాధితులను రేడియేషన్ వంటి దుష్ప్రభావాల నుంచి వైద్యపరంగా ఆదుకోవటానికి మన దేశం సిద్ధంగా ఉందా?
   అదేవిధంగా చెర్నోబిల్ తరహా ప్రమాదం జరిగితే వ్యవసాయ రంగాన్ని ఆదుకోగల సాంకేతిక పరిజ్ఞానం మన దేశానికి లేవనితెలిస్తే ఆశ్చర్యపడక తప్పదు. అయితే ఇది నూటికి నూరుపాళ్లు నిజమని సంబంధిత శాఖ కార్యదర్శులు చెబుతున్నారు. అణుప్రమాదం జరిగితే బాధితులకు నష్ట పరిహారం చెల్లించే విషయమై తీసుకున్న జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం అణుధార్మికత బారి నుంచి బాధితులకు వైద్య చికిత్సలు, వ్యవసాయపరంగా తలెత్తే సమస్యలపై ఆలోచించలేదని ఈ శాఖల కార్యదర్శులు పార్లమెంట్ స్థాయి సంఘానికి తెలియచేశారు. చట్టబద్ధత పొందిన ఈ బిల్లులో ఎక్కడా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి ఒక్కక్లాజు కూడాలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. అంతేకాక ఈ బిల్లుకు రూపకల్పన చేస్తున్నప్పుడు అణుశాఖ మాటవరసకైనా తమ శాఖను సంప్రదించలేదని ఆరోగ్య కార్యదర్శి తప్పుపట్టారు. ప్రమాదం జరిగితే అణుధార్మికత బారిన పడే ప్రజలకు చికిత్సలు అందించగల స్థితిలో తమ శాఖ లేదని కార్యదర్శి చెప్పారు. దేశంలోని ఆస్పత్రుల్లో అణుధార్మిక బాధితులకు చికిత్స చేసేందుకు కావలసిన పరికరాలు, చికిత్స చేయటానికి ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు లేరని ఆరోగ్యశాఖ తెలిపింది. అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్న ప్రాంతాలలో ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ఆస్పత్రులను ఏర్పాటు చేయని పక్షంలోప్రమాదం జరిగితే తీవ్ర సమస్యలు తప్పవని స్పష్టం చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!