సూపర్ మూన్ తెచ్చిన భూకంపం

 భయపడినంతా అయింది. సూపర్ మూన్ వస్తూనే మరోసారి జపాన్ భూభాగాన్ని వణికించాడు. శనివారం (19-03-2011) భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4-00 గంటల ప్రాంతంలో జపాన్ ఉత్తర ప్రాంతంలో మరోసారి భూకంపం వచ్చింది. అలలు ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాయి. 
  శనివారం రాత్రి 3-00 గంటల ప్రాంతంలో చంద్రుడు మన భూమికి మరింత చేరువగా వస్తున్నాడు. దీని ప్రభావం భూమిపై పడుతుందని గత కొంత కాలంగా అంతా భయపడుతున్నారు. అనుకున్నట్టుగానే వారం రోజులు ముందే గత వారమే (శుక్రవారం) జపాన్ లో ఫెను భూకంపం, సునామీ విరుచుకుపడింది. ఇప్పుడు సరిగా సూపర్ మూన్ కనబడే సమయంలో మరోసారి జపాన్ లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. ఇంకా ఎలాంటి విపత్తులు చూడాల్సి వస్తుందోనని జనం భయపడిపోతున్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!