`T' అంటే, అది బూతా!!
తెలంగాణ సమస్య అనగానే అదేదో బూతు అయినట్టు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు ఉంది. `T' అంటే, బూతుకాదు. శాసన సభలో గౌరవ సభ్యులు దీని గురించి ఎందుకు మాట్లాడటంలేదు. ట్యాంక్ బండ్ మీద సాంస్కృతిక చిహ్నంగా నిలిచిన విగ్రహాలను కూల్చివేసిన సంఘటనపై పెదవి విప్పిన గౌరవ సభ్యులు తెలంగాణ పై చర్చించడానికి ఎందుకు ముందుకు రావడంలేదు? అదేమన్నా పాపమా... విగ్రహాల పడిపోగానే గంటలకొద్దీ మాట్లాడే పెద్దలు తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వారి సంగతి ఎందుకు మాట్లాడటంలేదు...? తెలంగాణ విషయంలో కేంద్రం మాట ఇచ్చింది. కానీ ఆ మాట నిలబెట్టుకొనే విషయంలో అపరిమితమైన జాప్యం జరుగుతోంది. దీంతో ప్రజలు ఉద్యమకారుల్లా మారిపోతున్నారు. వీటన్నింటి ఫలితమే విగ్రహాల ధ్వంసం. వీటి ఫలితమే వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెంటనే మేల్కొండి. దీనిపై చర్చించండి. అటో, ఇటో ఏదో ఒకటి తేల్చండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి