రేడియేషన్ సోకితే కలిగే హాని ఏమిటి?

జపాన్ లోని అణురియాక్టర్ నుంచి వెలువడుతున్న రేడియేషన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. జపాన్ కు తూర్పున ఫసిపిక్ మాహాసముద్రంవైపుకు రేడియేషన్ పయణిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా ఇదే జరిగితే, అమెరికాలోని కాలిఫోర్నియాపై కూడా రేడియేషన్ ప్రభావం చూపవచ్చు.
 రేడియేషన్ మోతాదు దాటితే, శరీరానికి హానికలిగిస్తుంది. వాతావరణంలో 5 ఆర్ఈఎంలకంటే ఎక్కువగా రేడియేషన్ ఉంటే ప్రమాదమే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.....
తీవ్రత                                  ప్రభావం
5-20                                  నింపాదిగా ప్రభావితం చూపుతుంది.
20 - 100                           తెల్లరక్తకణాలు తగ్గిపోతాయి. 
100 - 200                          రోగాలను తట్టుకునే శక్తిని కోల్పోతారు
200-300                          ప్రభావితం చూపే వారిలో 35 శాతం మంది మరణించవచ్చు
400- 1000                       50 శాతం మంది మరణం.
1000 - 5000                    క్షణాల్లోనే మరణం
 ప్రస్తుతం జపాన్ లో అణురియాక్టర్ పేలిన చోట 40 కిలోమీటర్ల పరిధిలో 30 ఆర్ఈఎంల మేరకు రేడియేషన్ ఉన్నదని అధికారికంగా ప్రకటించారు. అందుకే ఆ ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కాలిఫోర్నియా వాతావరణంలో సైతం అణుధార్మిక శక్తి పెరిగే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
                                                                        - సి.హెచ్. సుబ్బారావు








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!