మరుగు దొడ్డా?మనీ కేంద్రమా?

తమాషా`కీ' 
........................
మరుగు దొడ్డా?మనీ కేంద్రమా?
 
  ఒహో అకౌంట్లో డబ్బులు పడ్డాయికదాని ఎగేసుకెళ్ళి ఏ.టి.ఎం లో దూరి టకటకా పిన్ నెంబర్ నొక్కి డబ్బులు లాగేసి చికెన్ బిర్యాని లాగించడానికెల్తున్నారా?అయితే ఒక్క సెకండాగండాగండి..వచ్చినయి డబ్బులే కాదు,జబ్బులు కూడా అని గ్రహించండి.
ఏ.టి.ఎం అనగా నగదు బట్వాడ యంత్రమే కాదు,నానా జబ్బుల బట్వాడ యంత్రం కూడాను!
ఈమధ్య ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలిన సత్యమేమనగా ..కీపాడ్,కీ బోర్డ్,ఏ.టి.ఎం లోబ్యాక్టీరియాలకు ,పబ్లిక్ టాయిలెట్లో వున్న బ్యాక్టీరియాలకు అవినభావ సంబందముందట.మరుగుదొడ్ల నుంచి చేతివేళ్ళ ద్వారా ఏ.టి.ఎం కరెన్సీ మిషన్ మీద తిష్ట వేశాయంటున్నాడు డా.రిచర్డ్ హాస్పింగ్స్ ఆఫ్ బయో కోట్ లి.,
అంతేకాదు ఆఫీసు థంబ్ పంచింగ్ మిషన్లో,పబ్లిక్ ఫోన్ లో కూడా ఈ బ్యాక్టీరియాలు మనవల్ల మనకోసం కాపు కాసుకు కూచున్నాయట..అరివీర భయంకర జబ్బులను మనకు అంటగట్టడానికి ఆవురావురుమంటున్నాయట.. కాబట్టి జర సూస్కొని పని జేసుకోండ్రి..
- మృత్యుంజయ

కామెంట్‌లు

  1. ఇంగ్లాండ్‌లోని పబ్లిక్ లెట్రిన్‌లలో టాయ్లెట్ పేపర్లు వాడుతారు. అవి ముట్టుకున్న చేతులతో ఎటిఎం కీలు ముట్టుకుంటే బాక్టీరియా ఎందుకు రవాణా అవ్వదు? ఇండియాలో అటువంటి లెట్రిన్‌లు లేనందుకు సంతోషించాలి.

    రిప్లయితొలగించండి
  2. చచ్చినట్లు అంటించుకోవల్సిందే,లేక చస్తామా ?మరో దారిలేదుకదా ?ఇదో రకం అంటించుకొనే వ్యాధి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!