మళ్ళీ వచ్చిందబ్బా...

మళ్ళీ వచ్చిందబ్బా... అంతర్జాతీయ మహిళ దినోత్సవం మళ్ళీ వచ్చేసింది. అయితే, వాస్తవ పరిస్థితులు ఏమిటి?
తరాలు మారుతున్నా...మహిళల తలరాతలు మారడంలేదు. ఆకాశంలో సగభాగమని చెప్పుకునే మహిళలకు సమాజంలో అంత భాగస్వామ్యం ఉందా? భూదేవంత సహనం ఉందని చెప్పుకుంటున్న మహిళలకు అంతటి గౌరవం లభిస్తుందా? స్ర్తీలు ఎక్కడ గౌరవింప బడతారో....అక్కడ సిరిసంపదలు వర్థిల్లితాయని చెప్పుకునే ఇండియాలో వారికి అంతటి ప్రాముఖ్యతను ఇస్తున్నామా? కేవలం ఆటబొమ్మలగానే లేడీస్‌ను చూస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కుంటే దొరికేవి...అవమానాలు, మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు. నిత్యం దేశంలో ఏదో ఒక చోట మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయి. వాటిని నివారించడానికి చట్టాలు ఉన్నప్పటికీ...అవి అమలు కావడంలేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను చేయాల్సిన ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఫలితంగా మహిళలు ఇప్పటికీ బానిసలుగా బతుకుతున్నారు. మీ అభిప్రాయాలను తెలియజేయండి....
- సిహెచ్. సుబ్బారావు
 జర్నలిస్ట్
subbutv33@gmail.com



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!