మహిళ ఏడ్చే టైమ్ ఎంత?

 
ఆడదిగా పుట్టినందుకు జీవితాంతం ఏడ్వాల్సిందేనంటూ పూర్వం పెద్దలు చెబుతుండేవారు. నిజంగానే ఆడది జీవితాంతం ఏడ్వాల్సిందేనా...? ఒక వేళ ఇదే నిజమైతే, మొత్తం జీవితకాలంలో కంటనీరు పెట్టుకునే సమయం ఎంత ఉంటుంది? ఈ ఆసక్తికరమైన అంశాలపై సర్వేలు జరిగాయి. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి...
  సమాజంలో సగ భాగాన్ని కోరుకుంటున్న మహిళకు కన్నీళ్లు మాత్రం పురుషుల కంటే ఎక్కువే. ఆడశిశువు పట్టినప్పటి నుంచి మహిళగా ఎదిగే వరకు అనేకసార్లు ఏడుస్తోంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్దాప్యం ఇలా ప్రతి దశలోను మహిళ కన్నీరు పెడుతుందని మీకు తెలుసా?  ప్రతి మహిళ సగటున జీవిత కాలంలో ఎన్ని గంటలు ఏడుస్తోందో అంచనా వేశాయి వివిధ రకాల సర్వేలు.

 మహిళ జీవిత కాలంలో సగటున ఎన్ని గంటలు ఏడుస్తుందో తెలుసుకోవడానికి మూడు వేల మంది మహిళల్ని ఎంచుకుంది ఓ సర్వే సంస్థ. సగటున మహిళ తన జీవిత కాలంలో  16 గంటలు ఏడుస్తోందని సర్వేలు తేల్చాయి. ఇలా ఏడ్వడానికి కారణాలను విశ్లేషించి వివరించాయి ఆ సర్వే సంస్థలు. అలసిపోవడం, బాధించడం, కిందపడడం తదితర కారణాలతో బేబీ దశలో కన్నీరు పెడుతుంది. అలాగే, నాలుగు నుంచి 12 ఏళ్ల మధ్య బాలికలు మానసికంగా బాధించడం వల్ల ఏడుస్తారు. అదే, టీనేజ్‌లోని బాలికలు హోర్మోన్ల మార్పుల వల్ల బాధపడతారు. ఫలితంగా ఏడుస్తారు. సహచర మిత్రులు, ఇతరుల వాదాపవాదాల వలన కూడా ఈ వయస్సులో ఏడ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక, 26 సంవత్సరాలు పైబడిని వారు వారి పార్టనర్‌ లేదా ఇతరత్రా బాధించే న్యూస్‌ చెవిన పడడం, అలసి పోవడం తదితర కారణాల వలన కన్నీరు పెడతారు. ఇలా సగటున ప్రతి దశలోననూ కన్నీరు పెట్టే సమయాన్ని 16 నెలలుగా అధ్యయనం లో గుర్తించారు. 

మహిళలు కన్నీరు పెట్టుకునే సమయం
  • మొదటి ఏడాది మూడు గంటలు
  • 4ఏళ్ల బేబీ 2గంటలా5 నిమిషాలు
  • 4-12మధ్య వయస్సున్న వాళ్లు వారానికి 2.11 గంటలు
  • టీనేజ్‌లో వారానికి 2.13 గంటలు
  • 26 ఏళ్ల పైబడిన వాళ్లు వారానికి 2.14గంటలు
  • పుట్టినప్పటి నుంచి 78ఏళ్ల వయస్సులోపు 12వేలా 13గంటలు
రచయిత:సిహెచ్. సుబ్బారావు
 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!