హైదరాబాద్ కు అణువిలయం తప్పదా!

    హైదరాబాద్ లో అణు ఇంధన సముదాయం (న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్- NFC) అనేది ఒకటి ఉన్నదని ఇప్పుడంతా గుర్తుంచుకోవాలి. జపాన్ అణు విపత్తుతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రజలు (మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులు) 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎన్.ఎఫ్.సీ ని చూడగానే భయపడిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం... దేశంలోని 20 అణు రియాక్టర్లలో 18 రియాక్టర్లకు ఇక్కడి నుంచే అణు ఇంధనం సరఫరా అవుతోంది. అంటే, ఇక్కడ ఎంత స్థాయిలో అణు పదార్ధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నిత్యం టన్నుల కొద్దీ యురేనియం నిల్వలు ఉంటాయి ఇక్కడ. అయితే, ఎన్ని టన్నులన్నది చాలా గోప్యంగా ఉంచుతారు. కనీసం 200 టన్నుల దాకా ఉండవచ్చన్నది నిపుణుల అంచనా... సాంకేతికంగా ఎంతో ఎదిగిన జపాన్ లోనే అంతటి ఘోర అణు విపత్తు సంభవిస్తే, మరి మనదేశంలో అరకొర భధ్రతల మధ్య ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎంతటి తీవ్రనష్టం వాటిల్లుతుందోనని జనం భయపడిపోతున్నారు.
 హైదరాబాద్ లో అలాంటిది జరిగితే...ఆ విలయం ఊహకు అందదు. హైదరాబాద్ నగరంతో సహా చుట్టుపక్కల ప్రాంతాలు చరిత్రగర్భంలో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు.
 మన హైదరాబాద్ కు ఏమీకాదని  `హైదరాబాద్ లవర్స్' అడ్డంగా వాదించవచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుంటే, వారి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. హైదరాబాద్  భూకంపాలు వచ్చే జోన్ లోనే ఉంది. హైరిస్క్ జోన్ కాకపోయినా, ఎప్పుడైనా పెనుభూకంపం రావచ్చు. ఇప్పటికే అనేకమార్లు రెక్టర్ స్కేల్ పై 5 వరకు భూమి కంపించింది. అలాంటప్పుడు ఎన్.ఎఫ్.సిలో ఏదైనా ప్రమాదం జరిగితే, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.

కామెంట్‌లు

  1. NagaBhushan Garu,

    Uranium store cheyyadam valla emi problem undadu andi, kani eppudite uranium ne Atomic reaction lo vadataro appude problem

    రిప్లయితొలగించండి
  2. Whats happening in Japan is entirely different. A working nuclear reactor has lost its cooling towers and hence the problem. Possibility of the core in the nuclear reactor melting down and going out of its core is feared. In Hyderabad we do not have any nuclear reactor. In NFC what they do is converting the raw uranium into fuel and all precautions are taken.

    Even if earthquake hits Hyderabad (touch wood), and NFC is devastated, the damage would be to search for the raw material and restore it so that it would not fall into undesirable hands.

    Do not just create some panic like today's media. The media shouted hoarse about 2012 and now about super moon. Whats the result? May be you do not remember the scare Eenadu created regarding Skylab space ship falling down in Karimnagar District during 1979. Ultimately, it was lead to fall in sea near Australia.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!