అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3


అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలో అపార నిధినిక్షేపాలు దొరకడంతో ఇప్పుడు అందరి కళ్లు అటే పడ్డాయి. తరగని సంపద ఉన్నదని సంతృప్తి చెందుతున్నా మేకానీ, అదంతా ఎలా వచ్చిందో ఆలోచించడంలేదు. అనేక యుద్ధాలు, రక్తపాతాలు, పసిగుడ్డు తల్లుల శాపనార్ధాల ఫలితంగా కూడా సంపద ఈ నేలమాళిగలో పోగయింది. ఈ మాట గట్టిగా అంటే, నేనేదో హేతువాదిననో, దేవుడికి తీరని అన్యాయం చేస్తున్నాననో అనుకోవచ్చు. అలాంటి ఉద్దేశాలు, ఇమేజ్ లు నాకు లేవు. ఉన్నదల్లా, వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావలన్న తపనమాత్రమే.  ఇప్పటికే రెండు పార్ట్స్ చదివే ఉంటారు. ఇది ఆఖరి పార్ట్.
నాటి పాలకులు సుంకాలు వసూలు చేయడంలో చాలా నిర్దయగా వ్యవహరించేవారు. అపార సంపదను కూడబెట్టడం మార్తాండవర్మ హయాంలోనే ఎక్కువ జరిగిందని  అక్కడి స్థానికులు చెబుతున్నారు. సామంతరాజులు, విదేశీ వ్యాపారవేత్తల నుంచి వచ్చే కానుకలతో పాటుగా అతి సామాన్యుల దగ్గర నుంచి కూడా ముక్కు పిండి సుంకాలు వసూలు చేసి కోశాగారం నింపేవారు. నిజం చెప్పాలంటే, కోశాగారంలో ప్రధాన వాటా ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చి చేరిందే… నిమ్నవర్గాల వారిని కూడా సంస్థానాధీశులు వదిలిపెట్టలేదు. పెళ్ళి జరుగుతుందంటే చాలు, సుంకం చెల్లించాల్సిందే. పిల్లలు పుట్టినా పన్ను కట్టాల్సిందే. చివరకు మృత్యువు కౌగలించుకున్నా, కాటి సుంకం కట్టాల్సిందే.
ఇంకా అనేక వస్తువులపై కూడా పన్ను భారీగానే చెల్లించాల్సి వచ్చేది. నాటు పడవలు కొన్నా మత్స్యకారులు సుంకం చెల్లించాల్సిందే. రైతులు నాగళ్లు కొనేటప్పుడు సుంకం చెల్లించాల్సి వచ్చేది. ఎడ్లబండ్లు తయారు చేయించుకున్నా, చివరకు గొడుగులు కొన్నా సంకం తప్పదు. పన్నుల బెడద ఇంతటితో ఆగలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. మీసాలు పెంచినా పన్ను కట్టాల్సి వచ్చేదంటే ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇదే నిజమని చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ఈ దోపిడీ ఇక్కడితో ఆగలేదు. తల్లులు పిల్లలకు పాలివ్వాలంటే ముందుగా విధిగా సుంకం కట్టితీరాల్సిందే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ,  `ములకరమ్’ గా పిలిచే బ్రెస్ట్ టాక్స్ ని మాత్రం నాటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన కథ ఒకటి కేరళలో ప్రచారంలో ఉంది.

బిడ్డకు పాలివ్వాలన్నా సుంకం

చెరితాలాకు చెందిన కాపున్తల కుటుంబానికి చెందిన ఓ యువతి తన కుమారుడికి స్తన్యం ఇస్తోంది. అయితే, ఆమె ఇందుకు సుంకం చెల్లించలేదు. అంటే పాలివ్వడానికి అధికారికంగా ఆమెకు అనుమతి రాలేదన్నమాట. ఈ విషయం తెలియగానే రాజాధికారులు అక్కడకు చేరారు. ఆమెను నిలదీశారు. సుంకం చెల్లించకుండా పిల్లకు పాలివ్వడం నేరమంటూ వాదనకు దిగారు. దీంతో ఆ తల్లి ఇంట్లోకి పోయింది. సుంకం సొమ్ము తెచ్చి ఇస్తుందని అధికారులు భావించి ఇంటి ముందు వేచి ఉన్నారు.  కానీ అనుకోని సంఘటన జరిగింది. లోపలి నుంచి బయటకు వచ్చిన ఆ యువతి తన రెండు స్తన్యాలను కోసి దోసిళ్లతో పట్టుకుని వాటిని రాజాధికారుల పాదాల ముందు గిరాటేసి కుప్పకూలి చనిపోయింది.

- తుర్లపాటి నాగభూషణ రావు

ఈ వ్యాస రచయిత తుర్లపాటి నాగభూషణ రావు,  `అనంత’ సంపద వెనుక కన్నీటి కథలపై డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఉంటే రచయితను సంప్రదించ గలరు. అలాగే, ఇతరత్రా సహాయ సహకారాలు కూడా అందించవల సిందిగా రచయిత కోరుతున్నారు  రచయిత ఫోన్ నెంబర్ 9885292208, ఈ మెయిల్: nrturlapati@gmail.com

- ఎడిటర్

కామెంట్‌లు

  1. మీరు చరిత్రను చదివానంటున్నారు. ఏచరిత్ర ? భారతదేశపు అసలు చరిత్రా ? విద్వేషాలు నూరిపోయటానికి విదేశీ పాలకులు,విదేశీ గూఢచారులు కలగాపులగంగా వక్రీకరించిన చరిత్రా ? ఇప్పుడు కూడా జరుగుతున్నచరిత్రేమిటో కాస్త మన స్వయంబుధ్ధితో యోచించాలి ,,అప్పుడు అర్థమవుతుంది మనకు ఓపిక ఉంటే .

    రిప్లయితొలగించండి
  2. అబ్బా ఇంకో విలేఖరా, ఏమి ఖర్మరా నాయన.
    కధలు బాగున్నాయి మాష్టారు, అరుంధతీరాయ్ కి అమ్ముకోవచ్చు.

    ఓ పరలోకంలో ఉన్న ప్రభువా ఈ జీవులకి వచ్చే జన్మలో ఐనా బుర్రలో కుసింత గుజ్జు పెట్టు తండ్రి.

    రిప్లయితొలగించండి
  3. నోరి నరసింహ శాస్త్రి గారి కవిద్వయం,పండిత ఆదిరాజు వీరభద్రరావు -- ప్రాచీన అంధ్రమహానగరములు అన్న రెండు గ్రంథాలలో మన తెలుగు రాజులు స్తనాలపై పన్నులు విధించిన విధివిధానములు ఆ వైనం తెలుసుకున్న పోతన ఎలా యేవగించుకున్నదీ సవివరంగా చదవవచ్చు ఓపికుంటే

    రిప్లయితొలగించండి
  4. చరిత్ర అంటే ఆకాలంలో ఆకులు కట్టుకుని తిరిగేవారట, మరిప్పుడు మీరు నెట్ మీద కూచుని టక్కు టక్కు అని టైపుతున్నారుకదా? టాక్సులు ఇప్పుడూ వున్నాయి, షేవింగ్ బ్లేడు, క్రీము మీద కూడా అమ్మకం, ఎక్సైజు సుంకాలున్నాయి, మరి మన్మోహన్ జిజియా పన్ను వేస్తున్నాడహో అని డప్పుకొట్టి చాటిస్తారా ఏమిటి?! లేదంటే ఆ సొమ్ము సోమరి ఎదవలకు పంచేద్దామంటారా?! ఏమీటో పెతొక్కళ్ళూ కమూనిష్ట్లైపోతున్నారు, 'తనది కాకుంటే చాలు సామ్యవాదమే!'

    రిప్లయితొలగించండి
  5. ఔరంగజేబు జుత్తు పన్ను వసూలు చేస్తే తప్పు కానీ హిందూ రాజులు స్తన్యాలపై పన్నులు వసూలు చేస్తే ఒప్పా? పన్నుపోట్లు ఎవరు వేసినా అది పన్నుపోటే. అది హిందూ రాజులైతే ఏమిటి, ముస్లిం రాజులైతే ఏమిటి?

    రిప్లయితొలగించండి
  6. మీ చైనాలో పన్నులు వుండవా ప్రవీణ్?! ఒకటికన్నా ఎక్కువ పిల్లల్ని కంటే ఫైన్ వేసి జైల్లో పెడతారంట కదా? :) కప్పలు, బల్లులు, దీపపు పురుగులు వేపుకు తింటే కామ్రేడిజం సిద్దిస్తుందని మావో చెప్పాడట, నిజమేనా? :D

    రిప్లయితొలగించండి
  7. ఇండియాలో కూడా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ నియంత్రణ చెయ్యించుకోకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తారు. అది కుటుంబ నియంత్రణ ప్రొమోషన్ అవుతుంది కానీ టాక్సేషన్ ఎలా అవుతుంది?

    రిప్లయితొలగించండి
  8. ప్రవీణ్
    మొదట అడిగిందానికి జవాబు చెప్పి ఆ తరువాత అడ్డదిడ్డంగా మాట్లాడాలి. చైనాలో టాక్సులు లేవా? అన్నదానికి సమాధానం ఇవ్వలేదు.

    సరే, ఇండియాలో అలా పీకి వేయబడిన (కాదు కుటుంబ నియంత్రణ ప్రమోషన్ అనాలా!) వారి లిస్ట్ ఏవైనా వుంటే, ఇచ్చుకో. ఏ చట్టం కింద అలా పీకేయవచ్చో కూడా గూగులించి, ఈడ పడేయ్.

    ఈమధ్య ఏమైనా 'గాలివానలో టైపు' కొంగ్రొత్త సాహితీగాన ప్రయోగాలేమైనా చేశారా? చెవికోసుకోవాలనుంది. నీ పాట అడిక్షన్లా వుంది, నిజం! మావో డింగ్-డాంగ్ గారి మీద ఒట్టు!! మరీ మరీ విన్నాను. వెధవది జేసుదాసుకు తెలిస్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడేమో, తన పాట కూడా నేను అన్ని సార్లు విననందుకు. పాటలకు 'కీబోర్డ్' సంగీతం వుంటే బాగుంటుంది, ఇక్కడే ఎవరో వున్నారు అడగకపోయావా? :P

    రిప్లయితొలగించండి
  9. అడ్డదిడ్డంగా మాట్లాడిందెవరు నాయనా? కుటుంబ నియంత్రణ చెయ్యించుకోనివాళ్ళకి ఫైన్ వెయ్యడం కూడా టాక్సేషన్ అవుతుందని వాదించింది నువ్వా, నేనా? నాలుగు శాతం ఉన్న టాక్సేషన్‌ని పన్నెండు శాతానికి పెంచిన పాలకులు ఉన్న ఇండియా చైనా కంటే గొప్పదా?

    రిప్లయితొలగించండి
  10. నేను వాదించానా? అదీ నీతో?!! ఎలా కనిపిస్తున్ననేంటి? ఇలా మాట్లాడితే ఒక్కగానొక్క అభిమానిని నీవు కోల్పోయే చారిత్రక తప్పిదం చేయబోతున్నావు, తెలుసా? నేనేమన్నానో పైనే వుంది చదివి 10సార్లు వల్లె వెయ్.

    ఇంతకీ న్యూ దృశ్యమాలికలు ఏమన్నా రిలీజింగు సేస్తున్నావా? యమ బోరింగ్ గా వుంది. ;)

    ఏమంటారు మీ ముల్లా ఓమర్? రెండువారాల్లో ఇచ్చుడు, ఆయన తెచ్చుడు, లేదా చచ్చుడటగా! కంగ్రాట్స్. :)

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!