పదవీ గండానికి యాగం..

కాగా, యడ్యూరప్ప శనివారం ఉదయం బిజెపి కేంద్ర పరిశీలకులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి రేపు ఆదివారం రాజీనామా చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించే దాకా వెళ్లిన యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొన్ని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గ సభ్యులు కూడా తాను సూచించినవారే ఉండాలని ఆయన షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం అన్నారు. మొత్తానికి శనివారం చేస్తున్న శత్రు సంహార యాగం ఫలించి, ఆదివారం వరకు ఏదైనా అద్భుతం జరిగి తన పదవి పదిలంగా ఉంటుందని యడ్యూరప్ప కోరుకుంటున్నారు.. రాజకీయాలలో ఏదైనా జరిగే అవకాశం వుంటుంది కాబట్టి.. ఏమవుతుందో.. వేచి చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి