డ్రగ్స్ గురించి నాకేమీ తెలియ‌దు..!


డ్రగ్స్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ సినీ నటుడు వరుణ్ సందేశ్ తెలిపారు. తన పేరు ఎందుకు ప్రచారంలోకి అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. కొన్ని ఛానల్స్ లో తనను అరెస్టుచేశారని ప్రచారం చేశారని కాని ఏమీ జరగలేదని, తన కుటుంబం ఆవేదన చెందిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు అడిగితే ఏమని చెప్పాలో తెలియలేదని, కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సిద్దార్ద అనే వ్యక్తి వరుణ్ సందేశ్ పేరు ప్రస్తావించడంతో వివాదం ఆరంభమైంది. తల్లిదండ్రులు టెన్షన్ పడవద్దని, తన అభిమానులను కూడా కోరుతున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరు వర్రీ కావల్సిన అవరం లేదని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం ఎవరు చేయవద్దని ఈ సందర్భంగా వరుణ్ సిందేశ్ టీవీలో చెప్పారు.సిద్దార్దను ఒకసారి ఆఫీస్ లో కలిశానని అంతకుమందిచి అతనితో పెద్ద పరిచయం కూడా లేదని ఆయన అన్నారు.ఏది ఏమైనా టీవీలు తన గురించి ప్రసారం చేసేటప్పుడు తనతో మాట్లాడి ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!