పేద‌వాడి వైద్యం ఆగిపోయింది..!

హైదరాబాద్ తో సహా పది జిల్లాలలో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం, రేట్లు పెంచాలన్న డిమాండును పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఈ పధకాన్ని తాము ఆమలు చేయలే మని కార్పొరేట్ ,ఇతర ఆరోగ్యశ్రీ స్కీము అమలు చేసే ఆస్పత్రులు ప్రకటించాయి.దీంతో వేలాది మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రుల కు వచ్చి కూడా తమను ఎవరు పట్టించుకోవడం లేదని వాపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంల ప్రతిష్టాత్మకంగా ఆరంభమైన ఈ స్కీముకు విశేష ఆదరణ లభించింది. పేదలు కూడా కార్పొరేట్ గుమ్మం ఎక్కగలుగుతున్నారు. అదే సమయంలో ఈ స్కీమ్ కార్పొరేట్ ఆస్పత్రులకు ఉపయోగపడుతోందని, ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడుతున్నాయన్న విమర్శ కూడా ఉంది.దీనిని హేతుబద్దం చేయాలన్న డిమాండు కూడా వచ్చింది. కొన్ని వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ విషయాలు ఎలా ఉన్నా, ముందుగా అమలు అవుతున్న స్కీమును ఆస్పత్రులు నిలిపివేయడంతో రోగులు ఇక్కట్లకు గురి అయ్యారు.ప్రభుత్వం దీనివల్ల మరింత ప్రతిష్ట కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.హైదరాబాద్, విశాఖ, గుంటూరు ,ఖమ్మం,కృష్ణ తదితర జిల్లాలలో ఈ స్కీమును నిలిపివేశారు.దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కామెంట్‌లు

  1. ప్రభుత్వ ఆసుపత్రులలో చెయ్యగలిగిన ఆపరేషన్‌లు ప్రైవేట్ ఆసుపత్రులలో చెయ్యిస్తే ఇవ్వడానికి ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఆరోగ్యశ్రీ ఒక జోక్ అని అన్నది. ఇకనైనా ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఆరోగ్యశ్రీ ఆపరేషన్‌లు చెయ్యిస్తే మంచిది.

    రిప్లయితొలగించండి
  2. ఆరోగ్యశ్రీలో మరొక అంశమేమిటంటే ఈ పధకంలో చేరాలంటే కనీసం యాభయి పడకలున్న ఆసుపత్రులకే అనుమతి ఇస్తారు. అంత పెద్ద ఆసుపత్రులకి వీళ్ళిచ్చే డబ్బు ఇప్పుడు సరిపోవడం లేదు. ఓ మోస్తరు సైజున్న ఆసుపత్రులని చేర్చుకుంటే కొన్నాళ్ళు ఈ స్కీమ్ కొనసాగుతుందేమో?

    రిప్లయితొలగించండి
  3. ఇంకో విషయం గమనించారో లేదో, ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులే బాగుంటాయి. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల డబ్బున్నవాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో అటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చూశాను. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలలోనే ప్రభుత్వ ఆసుపత్రులని నిర్లక్ష్యం చెయ్యడం జరుగుతోంది.

    రిప్లయితొలగించండి
  4. Where is Indrasena the most passionate fan of Jagan? What would he reply about it?

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!