ఆకాశంలో అద్భుతం...మరి కాసేపట్లో...

ఆకాశంలో అద్భుతం జరగబోతోంది.
చల్లటి కాంతులు చిందించే చంద్రుడు మరింత దగ్గరకు వచ్చేస్తున్నాడు.
ఇలా వస్తే ఏమవుతుంది...?
ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే హాట్ టాపిక్.
చంద్రుని ఆకర్షణ శక్తి పెరిగిపోతుందా....

ఫలితంగా, సునామీలు, భూకంపాలు రాబోతున్నాయా
అగ్నిపర్వతాలు పేలబోతున్నాయా?
సూపర్ మూన్ విలయం సృష్టించబోతున్నాడా?
చల్లటి చంద్రుడు విలన్ గా మారిపోయాడా?

    20ఏళ్లకొకసారి నిజంగానే చంద్రుడు చాలా దగ్గరకు వచ్చేస్తున్నాడు. అలా వచ్చినప్పుడల్లా ఒత్త చేతులతో రావడంలేదు. బహుమతులు, కానుకలు అంతకంటే పట్టుకురావడంలేదు. దూరంగా ఉంటేనే చల్లటి చందమామ...అందరికీ బంధువు. కానీ, అదే చందమామ దగ్గరకు వస్తే, వినాశనమే...విలయమే...శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న సత్యం ఇది. అయితే, ఆ పరిస్థితి ఇప్పట్లో రాదని వారంటున్నారు. ఎందుకంటే, చంద్రుడు మరీ భయం కొలిపించే స్తాయిలో దగ్గరకు రావడంలేదు. ఈ భూమిని అంతకంటే ఢీకొనడంలేదు. కనుక వాతావరణంలో కొద్దిపాటి మార్పులు తప్ప పెద్దగా భయపడాల్సింది ఏదీ ఉండదన్నదే శాస్త్రవేత్తల కచ్చితాభిప్రాయం.
  శాస్త్రవేత్తల వాదన ఇలాఉంటే, మరో పక్క జ్యోతిష పండితుల అభిప్రాయాలు మరో రకంగా ఉన్నాయి.  మార్చి, ఏప్రిల్ మాసాల్లో జల ప్రళయం తప్పదని గత కొన్ని నెలలుగా జ్యోతిష శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  అమెరికా జ్యోతిష్యుడు రిచర్డ్ నాల్ ఆ మధ్య - జపాన్ కు గండం ఉన్నదని కూడా చెప్పాడు. చంద్రుడు అత్యంత చేరువకు రావడానికి కొద్ది రోజుల ముందే, జపాన్ లో సునామీ విరుచుకుపడింది. భూకంపానికి టోక్యో తల్లడిల్లిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలకు చంద్రుడు చేరువకావడమే కారణమంటున్నారు జ్యోతిష్యులు.


చంద్రుని విశ్వరూపం
  కనుల పండువగా కనిపించే చల్లటి చంద్రుడు విశ్వరూపం దాల్చబోతున్నాడా...? 2011 మార్చి 19న అసలు ఏం జరగబోతున్నది..?? ఇప్పుడు ఎటు చూసినా ఇవే ప్రశ్నలు... 18 ఏళ్లకో కాకుంటే 20 ఏళ్ళకో ఒకసారి చంద్రుడు తన దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమికి మరింత చేరువగా వస్తుంటాడు. ఇలా అత్యంత చేరువగా వచ్చినప్పుడే చంద్ర బింబం పెద్ద సైజులో  కనబడుతున్నది. ఇలా అతి దగ్గరకు చంద్రుడు రావడాన్నే పెరిజీ అని పిలుస్తున్నారు. దీన్నే సూపర్ మూన్ గా కూడా అంటున్నారు. అయితే, చంద్రుడు కేవలం 19 వ తారీఖున మాత్రమే భూమికి దగ్గరకు వచ్చి, ఆ మర్నాడు మళ్ళీ దూరం అయిపోతాడని అనుకుంటే పొరపాటే. వాస్తవం ఏమిటంటే, మార్చి 19కి కొన్ని రోజులు అటూ, కొన్ని రోజులు ఇటు చంద్రుడు సూపర్ మూన్ ఫేజ్ లోనే ఉంటాడు. కేవలం మార్చి 19న మాత్రమే జల విలయం వచ్చేస్తుందంటూ సాగుతున్న ప్రచారం కేవలం వదంతులే... సూపర్ మూన్ చుట్టూ ఇప్పటికే అనేక భయాలు చోటుచేసుకున్నాయి... గతంలో సూపర్ మూన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే...

సూపర్ మూన్ - ప్రభావం

- 1938- న్యూఇంగ్లండ్ లో హరికేన్
- 1955 - హంటర్ వ్యాలీలో వరదలు
- 1974 - డార్విన్ లో తుపాను
-2005- అమెరికాలో కత్రినా

   మరి ఈసారి ఏం జరగబోతున్నది...? ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇదే... సూపర్ మూన్ కళ్లముందు కనిపించకముందే జపాన్ ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలం అయింది. సూపర్ మూన్ విలయం సృష్టిస్తుందన్న వాదనలు బలపడుతున్నాయి.

సూపర్ మూన్ -  భయాలు...

- భూకంపాలు వచ్చేస్తాయి
- అగ్నిపర్వతాలు పేలిపోతాయి
-సునామీలు విరుచుకుపడతాయి
-భయంకరమైన గాలులు వీస్తాయి
- సముద్రజలం ఎగిసిపడుతుంది



 సూపర్ మూన్ - వాస్తవాలు
........................
- ప్రతి 20 ఏళ్లకొకసారి సూపర్ మూన్
-3,57,210 మైళ్ల చేరువలో చంద్రుడు
-ఇది 48,768 కి.మీ దగ్గరకు
- సైజులో 14 శాతం పెరుగుదల
- వెలుగులో 30 శాతం ఎక్కువ

- తుర్లపాటి నాగభూషణ రావు




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!