ఉలిక్కిపడ్డ రాష్ట్రం

  జపాన్ అణు విపత్తుతో మన రాష్ట్రం కూడా ఉలిక్కి పడింది. అణువిద్యుత్ రంగంపై ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం కూడా శ్రద్ధపెట్టింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన జపాన్ లోనే ఇంతటి ఘోర ప్రమాదం చోటుచేసుకుంటే, మన దేశంలోని భద్రత ఏపాటిదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. తీవ్రమైన భూకంపం వస్తే, అణు విద్యుత్ కేంద్రాల వల్ల విలయం తప్పదని జపాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం పరిస్థితి ఓసారి పరిశీలిద్దాం...
రాష్ట్రంలో 12వేల మెగావాట్ల మేరకు అణువిద్యుత్ ఉత్పత్తి జరగాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం పలు అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ఊపెక్కాయి. అయితే, ఇప్పుడు జపాన్ అణు విపత్తుతో పునర్ సమీక్షించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

రాష్ట్రంలో ప్రతిపాదిత అణువిద్యుత్ కేంద్రాలు

- శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ
- గుంటూరు జిల్లా నిజాంపట్నం
- కడప జిల్లా పులివెందుల
- విశాఖ జిల్లా నక్కపల్లి

అణువిద్యుత్ ఎంతటి ప్రమాదకరమో జపాన్ ఘటన మరోమారు చాటిచెప్పింది. అయితే, మన రాష్ట్ర వాసులు ఈ తరహా విద్యుత్ కేంద్రాలను మొదటి నుంచీ ఎదుర్కుంటూనే ఉన్నారు. అణువిద్యుత్ పార్క్ లకోసమో, లేదా అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకోసమో ప్రయత్నాలు ప్రారంభించినప్పుడల్లా స్థానికులు అడ్డుతగులుతూనే ఉన్నారు. ఇప్పుడు జపాన్ దుర్ఘటన తోడు కావడంతో అణువిద్యుత్ కోసం భారీ వ్యూహాలను రచించిన ప్రభుత్వం పునరాలోచనలో పడాల్సి వస్తున్నది.

అణువిద్యుత్ వాడకంలోని ప్రయోజనాల గురించి ఊదరగొట్టే నాయకులు, ప్రమాదాలు తలెత్తితే ఎదుర్కునే సామర్థ్యం మనకు ఉన్నదా అని ఆలోచించడంలేదు. ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా పెద్దపెట్టున చర్యలు తీసుకోవడంలేదు. అణు ప్రమాదల పట్ల చైతన్యం లేకపోతే, చిన్న ప్రమాదం సంభవించినా అపార ప్రాణనష్టం జరిగే అవకాశాలే ఎక్కువ.

కామెంట్‌లు

  1. This is called panic reaction. There is no comparison between Japanese situation and ours. In our country we do not get such kind of earthquakes and we are not in such zone. We already have nuclear power plants which are working OK.

    We have the danger of our mischievous neighbor getting them attacked by his stooges inside the country. That is the present and real danger and that has to be countered effectively by the Government without the fear of being politically wrong.

    రిప్లయితొలగించండి
  2. It is true that Japan receives frequent earthquakes. But there is no guarantee that India will not face earth quakes. It is not wrong to think negatively in this kind of cases.

    రిప్లయితొలగించండి
  3. For our reaction, there should be scientific basis. Excepting parts of Western India, our Country is not in earth quake zone. This is confirmed by the Seismological Scientists. Yes, its always better to be prepared for the worst. But always thinking about worst scenarios would only stymie our outlook for development.

    The Left parties' objections in this regard are highly prejudicial as they opposed the N Deal with USA. Had it been with China, they would have made a dance about it. We should not be carried away by the propaganda centric leftists

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!