మన `మోహన్' అమాయకుడా?


 2జి స్పేక్ట్రమ్ అవినితీ నాకు తెలియదు... ఓటుకు నోటు వ్యవహారం నాకు అసలే తెలియదు...అంటున్న ప్రధాన మంత్రి మన్మోహన్ నిజంగానే అమాయకుడా? దేశంలోని అవినీతి బాగోతంలో మన్మోహన్ కు ప్రమేయం ఏమీలేదా? అంతేకాదు, కేబినెట్ లో ఎవరిని ఉంచాలో, మరెవరిని పీకాలో కూడా పీఎంకు పవర్స్ లేవు. చాలా మంది అనుకునేదేమంటే, సోనియానే తెరవెనుక నుంచి నడిపిస్తున్నారని. కానీ, ఇది కూడా తప్పేనట. అసలు వెనుక ఉన్నది అమెరికావాళ్లు. ఈ మాట అంటే వాళ్లకు కోపం రావచ్చు. కానీ ఇది నిజం.
  కేబినెట్లో ఎవరిని ఉంచాలో ఎవరిని తీసెయ్యాలో మన్మోహన్‌కు, సోనియాకూ అమెరికానుంచి ఆదేశాలు వస్తున్నాయట. అంతేనా, నీరా రాడియా, కనిమొళి, బర్ఖాదత్ లాంటి వాళ్లు కూడా తమపాత్ర దివ్యంగా పోషించారు. పాపం మన్మోహన్ వ్యక్తిగతంగా అవినీతిచెయ్యకపోతేనేమి - లంచగొండులకు, ప్రజావ్యతిరేకులకు కావల్సినంత చేసి(దోచి)పెడ్తున్నారు. అంతా చేసి అమాయకుడిలా ‘తప్పంతా నాదే’ అంటూ మేడమ్‌కు ఇబ్బంది రాకుండా చూడాలని విఫలప్రయత్నం చెస్తున్నారు.
                         - ఆర్.కె.ఎస్ (విశ్లేషకుడు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!