సూపర్ మూన్ ప్రభావం - ఢిల్లీలో భూప్రకంపనలు



ఎవరు అవునన్నా, కాదన్నా, సూపర్ మూన్ (మహాచంద్రుడు) ప్రభావం కనబడుతూనే ఉంది. మార్చి 19వ తేదీ (సూపర్ మూన్ కనిపించిన రోజు) భారత కాలమానం ప్రకారం సాయంత్రం జపాన్ లో మరోసారి భూకంపించినట్టు వార్తలందాయి. అయితే ఆ తరువాత ఎక్కడా విపత్తులు సంభవించినట్టు వార్తలు రాకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఇది తప్పని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో సోమవారం సాయంత్రం సంభవించిన భూకంపం మానవాళిని హెచ్చరించింది. ఆప్ఘనిస్తాన్ లోని హిందూకుష్ పర్వతశ్రేణుల్లో సంభవించిన భూకంపం ప్రబావం మనదేశంపైన కూడా పడింది. ఢిల్లీ, రాజస్థాన్, జైపూర్ లో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయపడిపోయారు. రిక్టర్ స్కేల్ పై 5.8 తీవ్రత ఉన్న ఈ భూకంపం జమ్మూకాశ్మీరు ప్రాంతంపైన కూడా పడింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!