సోనియాబొమ్మకు చెప్పులు వేసిన వ్యక్తికి టిక్కేట్టా?



చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్ధిగా తయారై, పంటికింద రాయిలా మారిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కొత్త వాదనను తీసుకువస్తున్నారు. తన తరపున గెలిచిన దేశాయి తిప్పారెడ్డి కాంగ్రెస్ వ్యక్తేనని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సోనియాగాందీ బొమ్మకు చెప్పుల దండ వేసిన నరేష్ కుమార్ రెడ్డికి టిక్కట్ ఇచ్చారని అందుకే తాము అతనిని వ్యతిరేంచామని, జగన్ వర్గం కూడా తమకు సహకరించిందని పెద్దిరెడ్డి చెబుతున్నారు. సహజంగానే సోనియాగాంధీని అవమానించిన వ్యక్తికి టిక్కట్ ఇచ్చారన్న ప్రచారం జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మరక్షణలో పడతారు. అందుకే పెద్దిరెడ్డి తెలివిగా ఈ వ్యూహాన్ని ఎంపిక చేసుకున్నారు. సత్వరమే పెద్దిరెడ్డిపై చర్య తీసుకోవాలని అనుకున్నా, కాంగ్రెస్ అధిష్టానం ఒకటికి,రెండుసార్లు ఆలోచిస్తుందని అంటున్నారు. అదే సమయంలో కిరణ్‌ను పదవినుంచి దింపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని పెద్దిరెడ్డి నిర్మొహమాటంగా చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!