14, మార్చి 2011, సోమవారం

చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి పెటాకులేనా?

చిరంజీవి మొన్నీమధ్యనే ప్రజారాజ్యం దుకాణాన్ని కట్టేయాలని నిర్ణయించుకుంటే, కూతురు శ్రీజ కోరి వలచి ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ తో సంసారం సాగించలేక అత్తింట దుకాణం బంద్ చేసి పుట్టింటికి వచ్చేలా ఉంది. ప్రేమపెళ్ళికోసం శ్రీజ ఎంతగా తెగించిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి కుటుంబసభ్యుల కన్నుగప్పి, హైదరాబాద్ ఆర్యసమాజ్ లో గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుని అంతకంటే పకడ్బందీగా ఢిల్లీకి చెక్కేసిన శ్రీజకు, ఇప్పుడు ప్రేమపెళ్లి మత్తు వదిలినట్టుంది. శ్రీజ స్వయంగా హైదరాబాద్ లోని ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్ళి, భర్త తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇంటిగుట్టు మీడియాలోకి ఎక్కకుండా చిరంజీవి `జాగ్రత్త’లు తీసుకున్నట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ వార్త బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచాలనే ప్రయత్నాలు  కూడా ఊపెక్కాయి. మీడియా కారణంగానే గతంలో శ్రీజ పెళ్ళి తంతు, ఆపైన చిరంజీవి రాజకీయ ప్రహసనం రచ్చరచ్చయింది. అందుకే ఈసారి చిరంజీవి తన రెండో కూతురు శ్రీజ సంసార గొడవలు బయటకు రాకుండా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

2 వ్యాఖ్యలు:

  1. కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో పెట్టిందంటే అది తప్పుడు కేసే అయ్యుంటుంది. శిరీష్ నిజంగా కట్నం కోసం వేధించాడంటే నేను నమ్మను. తెలిసి తెలిసి ఎవడూ బంగారు బాతుని చంపుకోడు. చిరంజీవి పోతే అతని ఆస్తిలో శ్రీజకి కూడా వాటా వస్తుంది. భవిష్యత్‌లో రాబోయే కోట్ల ఆస్తిని కాదని 50 లక్షల కోసం ఎవడు ఆశపడతాడు? అతను తమ స్టేటస్‌కి చెందినవాడు కాదు కనుక ఎలాగూ వదిలించుకోవడానికి తప్పుడు కంప్లెయింట్ ఇచ్చి ఉంటారు. శిరీష్ 50 లక్షలు అడిగాడంటున్నారు. ఒకవేళ కట్నం అడగాలనుకుంటే కోట్లలో అడగగలడు. 40 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీసే ఫామిలీకి 50 లక్షలు ఒక లెక్క కిందకి రాదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. పాపం జమున కూతురి పెళ్ళి పెటాకులైనప్పుడు ఎన్ టి వి వాళ్ళు, ఆ విడిపోయిన జంటను లైవ్లో ఒకళ్ళతో ఒకళ్ళని మాట్లాడించి, తమ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళని కూడా ఏ టి వి 9 వాడో పుణ్యం కట్టుకుంటాడేమో. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు పాపం. ఏమైనా మీడియా వళ్ళకు కష్టంగానే ఉన్నది-ఇలాంటి చచ్చు పుచ్చు వార్తలు పోగేసి వ్రాయటానికి, చూపించటానికి.

    ప్రత్యుత్తరంతొలగించు