ఇక మనవల్లకాదు...జంతువుల్నే నమ్ముకుందాం!

 తనకంతా తెలుసుననీ, తనమాటే వేదమని భావించే మానవుడికి అతి త్వరలోనే తనకేమీ తెలియదనీ, ఈ భూమిమీద ఉన్న క్రిమికీటకాలకూ, పశుపక్షాదులకు తెలిసినంత జ్ఞానం కూడా తనకు లేదని గుర్తించే రోజు రాబోతున్నది.
 ఇప్పటికే అనేక జంతువులు ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే, ఒక్క మానవజాతి మాత్రమే ఏమాత్రం ముందే పసిగట్టలేకపోతున్నది. భూకంపాలను ముందే పసిగట్టడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. అయితే, అదేపని కుక్కలు, కప్పలు, గుర్రాలు, కోళ్లు చాలా ఈజీగా చేసేస్తున్నాయి. తమ జాతిని ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోగలుగుతున్నాయి.  జపాన్ భూకంపంతో ఈ విషయం తెలిపోయింది.
భూకంపం వచ్చినప్పుడు జంతువుల చేష్టలు ఇలా ఉంటాయి.....
 కుక్కలు పదేపదే మొరుగుతుంటాయి.
 గుర్రాలు సకిలిస్తుంటాయి
 కోళ్లు వింతగా ప్రవర్తిస్తుంటాయి
 కప్పలు దౌడుతీస్తాయి

ఎలా పసిగడతాయి?
   భూకంపం రావడానికి ముందు భూమి పొరల నుంచి తక్కువ పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత కిరణాలు వెలువడుతుంటాయి. వాటి వల్ల చిరాకు చెందే గుణం ఈ జంతువులకు ఉంటుంది. అందుకే అవి పిచ్చిఎక్కినట్టుగా ప్రవర్తిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 2009లో ఇటలీలో భూకంపం వచ్చినప్పుడు భూకంప కేంద్రానికి 74 కిలోమీటర్ల పరిధిలోని  కప్పలు ముందే తాముండే ప్రదేశాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. ముందుగా మగ కప్పలు భూకంపం వస్తున్నట్టు గుర్తిస్తాయి. ఆ తరువాత ఆడకప్పలకు ఈ సమాచారం అందజేస్తాయి. మొత్తంగా కప్పల కుటుంబాలు భూకంపం తాకిడికి గురికాకుండా నేర్పుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళిపోతాయి.
కారణం;
 కప్పలు ఇలా దౌడు తీయడానికి కారణం, భూమి పొరల్లోంచి వెలువడే రాడాన్ వాయువు. ఈ తరహా వాయువు భూకంపం వచ్చేముందే వెలువడుతుంది. ఈ వాయువు కారణంగా కప్పలు రాబోయే విలయాన్ని ముందే గుర్తిస్తాయి. దీంతోపాటుగా అయస్కాంత తరంగాలు సోకడంతో ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగలవంటున్నారు శాస్త్రవేత్తలు. భూకంపం రావాడనికి నాలుగైదు రోజుల ముంది కప్పలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతుంటే, అంతా తెలుసనుకునే మానవుడు మాత్రం భూకంప తీవ్రతకు బలైపోతున్నాడు.
 సో...మనకంటే, క్రిమికీటకాలు, పశుపక్షాదులే ఈ భూమిపై భద్రంగా ఉండగలవు. ప్రళయకాల సంకేతాలను అవే మనకంటే ముందుగా పసిగట్టి క్షేమంగా ఉండగలవు. కానీ, అన్ని జీవుల కంటే తానే అధికుడినంటూ పొంగిపోతున్న మానవజాతి మాత్రం క్రుంగిపోక తప్పదు.
 - తుర్లపాటి నాగభూషణరావు




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!