వివేకా బాధకు అసలు కారణం ఇది...!!
దివంగత నేత వైఎస్ సోదరుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వివేకానంద రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం వివేకా ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని కలసి తన రాజీనామా లేఖ అందించారు. నిన్నటితో ఎమ్మెల్సీ గా ఆయన పదవీ కాలం ముగిసింది.
సోమ వారం అసెంబ్లీ లో జరిగిన ఘటన పట్ల వివేకా విచారం ప్రకటించినా, సభలో కాంగ్రెస్ మంత్రులు ,సభ్యులు తనకు మద్దతుగా నిలవ లేదని వివేకా ఆగ్రహం తో వున్నట్టు తెలుస్తోంది. అలాగే మంగళ వారం కూడా సభలో వైఎస్ పై టీడీపీ విమర్శలు చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు .వైఎస్ సర్కార్ తో తమ కెలాంటి సంబంధం లేనట్టు కిరణ్ కాబినెట్ సభ్యులు వ్యవహరించిన తీరు వివేకాకు బాధ కల్గించి నట్టు సమాచారం. అలాగే భూ కేటాయింపులపై సభా సంఘం వేయడం పట్ల కూడా వివేకా గుర్రుగా వున్నారని అంటున్నారు .ఈ నేపధ్యం లోనే ఆయన రాజీనామా చేసినట్టు చెబుతున్నారు .గవర్నర్ కోటా క్రింద వివేకకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని వార్తలు వచ్చిన క్రమం లో ఆయన రాజీనామా చేయడం తో ఇప్పుడేమి జరుగుతుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి .
-jaijainayaka
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి