సాక్షి సీఈఓ రామ్‌కు ప్రచారబాధ్యతలు



సాక్షి టివి ఛానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ రామిరెడ్డి అలియాస్ రామ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచార బాధ్యతలు చేపట్టబోతున్నారా? సాక్షి మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రామ్‌ ప్రచార వ్యూహాల్లో దిట్టగా పేరు పొందారు. ఆయనకు యాడ్ ఏజేన్సీని సక్సెస్‌ఫుల్‌గా నడిపిన అనుభవం కూడా ఉంది. సాక్షి టివి, పత్రికలను పెట్టిన తర్వాత రెండింట్లో కూడా ఆయన తనపాత్రను పోషిస్తున్నారు, సాక్షి దినపత్రికలో ఫ్యామిలీ పేజీని సక్సెస్‌ చేశారన్న పేరు ఆయనకు ఉంది. అలాగే టివిలో కూడా ప్రత్యేకకార్యక్రమాలు నడుపుతూ ఉంటారు. అందర్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడేతీరు , ప్రచార మెళుకువలు బాగా తెలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న దృష్ట్యా ఆయన్ను రాజకీయ అవసరాల కోసం ప్రత్యేకించి పార్టీ ప్రచారం కోసం వినియోగించుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే రామ్ మీడియా రంగాన్ని వదిలి, రాజకీయ ప్రచార రంగానికి వెళ్తారా అన్న చర్చ మీడియా వర్గాల్లో జరుగుతుంది. అయితే వైఎస్‌కు వీరాభిమానిగా ఉండే రామ్‌ ఈ బాధ్యతను సవాల్‌గా తీసుకోవచ్చని కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా రాజకీయాల్లోకి దిగి ఈ బాధ్యతలు నిర్వహిస్తారా లేక కేవలం వృత్తిపరంగా ప్రచార ప్రకటనలు తయారు చేయడం, నేతల స్పందన విషయంలో సలహాలివ్వడం తదితర ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతారనేది తేలాల్సి ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!