రాజకీయ వ్యతిరేకత!
అవినీతికి అంతమైనా
రామరాజ్య స్థితికైనా
జనం మెచ్చు చట్టాలను
చేయలేని ప్రభుతెందుకు?
అవినీతిని అస్థిరతను
ప్రసాదించు పాలకులు!
పరిపాలన చేతకాని
మేకచన్ను నాయకులు!
నా దేశంలో నేను
నీతి కొంత కావాలని
నిరాహార దీక్షబూను
సంకల్పమే దౌర్భాగ్యం!
అవినీతిపై పోరుబాట
రాజ్యాంగ వ్యతిరేకమట!
రాజకీయ వ్యతిరేకమని
చెప్పడమే నేటి మాట!
అణచివేత సాచివేత
నక్క వినయ నేత చేత
చెల్లుబాటు ఇక కాదు!
ఉద్యమమే అసలు మందు!
- చల్లా రామ ఫణి
నా దేశంలో నేను
రిప్లయితొలగించండినీతి కొంత కావాలని
నిరాహార దీక్షబూను
సంకల్పమే దౌర్భాగ్యం!
-----------
పాయింట్ చక్కగా చెప్పారు.