ముగ్గురు మూవీ రివ్యూ


బ్యాన‌ర్ : సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత : డాక్ట‌ర్ డి రామానాయుడు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం : నాగేంద్ర వి. ఆదిత్య‌
సంగీతం : కోటి
మాట‌లు : స‌త్యానంద్‌
తారాగ‌ణం : శివాజీ, న‌వ‌దీప్‌, రాహుల్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, రీమాసేన్, శ్ర‌ద్దా దాస్‌, సంజ‌న‌, సౌమ్య‌, డాక్ట‌ర్ బ్ర‌హ్మానందం, క‌న్నెగంటి, ఆలి, ఆహుతి ప్ర‌సాద, వేణు మాధ‌వ్‌, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం త‌దిత‌రులు…


క‌థ : ప‌వ‌న్ (న‌వ‌దీప్‌), అంజి (రాహుల్‌), మారుతి (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌) ముగ్గురూ ఫ్రెండ్స్‌.. ప‌దిలోపే చుదువుకున్న వారు. విశాఖ‌లో ఖాలీగా తిరుగుతూండే నిరుద్యోగులు. లైఫ్‌లో సెటిల్ కావడం కోసం ఒక కోటీశ్వ‌రుడిని కిడ్నాప్‌చేయాల‌నుకుంటారు. అలా మ‌లేసియాలో సిటిల‌యిన‌ కోటీశ్వ‌రుడు జెపి (ఆహుతి ప్ర‌సాద్‌)ని కిడ్నాప్ చేయాల‌నుకుంటారు. బ‌ట్ వారు కిడ్నాప్ చేయ‌బోయేలోపు జెపికి హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. జెపిని ప‌వ‌న్ కాపాడుతాడు. ఆ సింప‌తీతో జెపి ప‌వ‌న్ గ్యాంగ్‌కి ఉద్యోగ‌లు ఇవ్వ‌డ‌మే కాకుండా అత‌ని ముగ్గురు కూతుళ్ళు శాలిని, యామిని, మోహినిల మ‌న‌సులు దోచుకుంటే వారితో పెళ్లి కూడా చేస్తానంటాడు. ఒక్క‌సారిగా వ‌చ్చిన అదృష్టానికి ఎగిరిగంతేసి ఆ ముగ్గురూ మ‌లేశియా వెళ‌తారు. ఈ ముగ్గురునీ ఓ కంట‌క‌నిపెట్ట‌మ‌ని జెపి అసిస్టెంట్ బ‌డేమియా (ఆలీ)కి జెపి చెబుతాడు. ఈ ముగ్గురు బ‌డేమియా క‌న్నుక‌ప్పి జెపి కూతుర్ల‌ని లైన్‌లో ప‌డేస్తారు. అలా ఆ ముగ్గురు, ఈ ముగ్గురి మ‌న‌సులు క‌లిసి పెళ్ళివ‌ర‌కు వెళ్ళే స‌మ‌యంలో బాలాత్రిపుర‌సుంద‌రి (రీమాసేన్‌) ఎంట‌ర‌వుతుంది. బాలాత్రిపుర‌సుంద‌రిన చూసి ముగ్గురూ షాక‌వుతారు.. ఇంత‌కీ బాలాత్రిపుర సుంద‌రికీ, ఈ ముగ్గురికీ ఏమిటి సంబంధం.. ఆ త‌ర్వాతేం జ‌రిగింద‌న్న‌ది మిగిలిన క‌థ‌..

విశ్లేష‌ణ : ద‌ర్శ‌కుడు నాగేంద్ర వి. ఆదిత్య ఈ సారి పూర్తిస్థాయి కామెడీ చిత్రంతో ముందుకి వ‌చ్చారు. సినిమా మొద‌లు నుండి చివ‌రివ‌ర‌కూ సినిమా అంతా కామెడీతో నిండి ఉంటుంది. మ‌న‌సంతానువ్వే లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చిన ఆదిత్య ఈ ముగ్గురు ద్వారా ప్రేక్ష‌కుల‌కి హాస్యాన్ని అందించాల‌ని ప్ర‌య‌త్నించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం.న‌ట‌న : న‌వ‌దీప్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందేముంది. త‌న పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా బాగానే చేశాడు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, రాహుల్‌లు ఓకే. హీరోయిన్స్ శ్ర‌ద్దాదాస్‌, సంజ‌న‌, సౌమ్య న‌ట‌న ఓకే. రీమాసేన్ న‌ట‌న బాగున్న‌ప్ప‌టికీ మొహంలో మున‌ప‌టి క‌ళ లోపించింది. ఆలీ కామెడీ ప్రేక్ష‌కుల‌ని న‌వ్విస్తుంది. చివ‌ర్లో చోటా డాన్‌గా వ‌చ్చే బ్ర‌హ్మానందం త‌న‌దైన శైలిలో కామెడీని పండిచారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!