పోచారం అరెస్టు


తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి , బాన్స్ వాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి సుదర్శనరెడ్డి కార్యక్రమాలను అడ్డుకోవడానికి పోచారం ప్రయత్నం చేసినప్పుడు ఈ అరెస్టు జరిగింది. మంత్రి సుదర్శనరెడ్డి రాజివ్ గాందీ విగ్రహాన్ని ఆవిష్కరించవలసి ఉంది. దానిని అడ్డుకొంటానని పోచారం ప్రకటించడంతో పోలీసులు ముందస్తుగానే ఆయన ఇంటి చుట్టూరా బందోబస్ ఏర్పాటుచేసి బయటకు వస్తే అరెస్టు చేస్తామని ప్రకటించారు. అయితే తనను బయటకు వెళ్లనివ్వకపోతే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని పోచారం హెచ్చరించారు. ఆ మీదట ఆయనను అరెస్టు చేసి అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. పోచారం అరెస్టుకు నిరసనగా బాన్స్ వాడలో తెలంగాణ ఆందోళనకారులు రాస్తరకో నిర్వహించారు.బాన్స్ వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా పోచారం శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఖండించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!