ఆంబోతు సెక్స్ అదిరింది




గుజరాత్ లోని కచ్ జిల్లాలో సనోస్రా అనే ఒక గ్రామం ఉంది. ఆఁ..ఏదో పల్లెటూరు కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఆ గ్రామంలో 14 ఏళ్ల ఆంబోతు ఒకటి ఉంది. దాని పేరు గోపాల్. పేరుకు తగ్గట్టుగానే ఇప్పటికే 486సార్లు  ఎదకొచ్చిన ఆవులను దాటేసింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ ఆంబోతుతో తమ ఆవులను దాటించాలని ఆవుల మంద యజమానులు ఎగబడుతుంటారు. దీంతో సనోస్రా గ్రామ గోశాల నిర్వహకులు ఆన్ లైన్ లో బుకింగ్ సౌకర్యం పెట్టారు. ఇప్పటికే 2013వరకు డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అంటే ఇప్పుడో ఆవును గోపాల్ చేత క్రాస్ చేయించాలనుకుంటే సదరు ఆవు యజమాని 2013దాకా ఆగాల్సిందే. బుకింగ్ లో ఇంకా లేట్ చేస్తే 2014, లేదా 2015 దాకా కూడా ఆగక తప్పదంటున్నారు గోశాల నిర్వాహకులు
గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని ఆవుల యజమానులు గోపాల్ తో తమ ఆవులను దాటించాలని క్యూకడుతున్నారు. ఇంతకీ ఈ ఆంబోతుతోనే ఎదకొచ్చిన ఆవులను దాటించాలని ఎందుకు ఉబలాట పడుతున్నారంటే… దీని వీర్యంతో పుట్టిన ఆవు దూడలుకానీ, లేదా కోడె దూడలుకానీ చాలా బలిష్టంగా ఉంటున్నాయి. అలా పుట్టిన విజయ్ అనే కోడెదూడ కేవలం నాలుగున్నరేళ్లకే ఆవులతో కలిసే వయసుకు వచ్చేసింది. ఇక ఆవు దూడలు పుడితే ఆ ఇంట పాల సిరి ఉన్నట్టే. రోజుకు 15 నుంచి 17 లీటర్ల పాలు ఇస్తాయి ఈ ఆవులు. ఇక గోపాల్ ప్రత్యేక ఏమిటంటే, మిగతా ఆంబోతులు తమ లైఫ్ టైమ్ లో 50సార్లు మాత్రమే ఆవులను దాటగలిగేశక్తితో ఉంటే, ఇది ఇప్పటికే 486 ఆవులకు గర్భం వచ్చేలా దాటింది. దటీజ్ గోపాల్ ఎలియాస్ ఆంబోతు.
-ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జగన్ జైలుకెళ్తే…

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!