అన్నాహ‌జారే దీక్ష విర‌మ‌ణ‌


అవినీతికి వ్యతిరేకంగా దీక్ష కొన‌సాగిస్తున్న అన్నా హజారే ఆదివారం ఉదయం 10 గంట‌ల‌కు దీక్ష విరమించారు. ఢిల్లీకి చెందిన ఐదేళ్ల చిన్నారి సిమ్రన్ నిమ్మరసం అందించి ఆయన చేత దీక్ష విరమింపజేసింది. తనకు సీంఘీభావం ప్రకటించిన వారందరికీ హజారే ధన్యవాదాలు తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే దేశంలోఅవినీతి తగ్గుతుందని, ఎన్నికల్లో నచ్చనివారిని తిరస్కరించే విధంగా సంస్కరణలు రావాలని అభిలషించారు. దేశంలో విద్య వ్యాపార మయిపోయిందని హజారే వాపోయారు. డబ్బు సంపాదించడమే ప్రైవేటు విద్యా సంస్థల లక్ష్యంగా మారిందన్నారు. విద్యా రంగంలో మార్పులు రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
జన లోక్‌పాల్ బిల్లు కోసం 12 రోజుల పాటు కఠిన దీక్ష చేపట్టిన 74 ఏళ్ల ఈ పోరాట యోధుడు 7.5 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు 64. 5 కిలోలు. దీక్ష విరమణ తర్వాత హజారే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లనున్నారు. దీక్ష ముగించిన తర్వాత మహాత్మ గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించాలని హజారే అనుకున్నారు. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రాంలీలా మైదాన్‌లో దీక్ష ప్రారంభానికి ముందు ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!