అమెరికాలో భూకంపం


అమెరికాలో భూకంపం ప్రజలను భయభ్రాంతులను చేసింద. అసలే ఆర్ధిక సంక్షోభం లో ఉంటే తాజాగా వచ్చిన ఈ భూకంపం అమెరికానువణికించింది.న్యూయార్క్,వాషింగ్టన్.వర్జీనియా,న్యూజెర్సీ,కొలరాడో తదితర రాష్ట్రాలలో వచ్చిన భూకంపంతో ప్రజలు అల్లాడిపోయారు. అమెరికా అద్యక్ష నివాసం, వైట్ హౌస్ , పెంటగాన్, కాపిటల్ హిల్స్ వంటి ముఖ్యమైన భవనాల నుంచి అంతా బయటికి వచ్చేశారు.వాషింగ్టన్ కు నూటముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని రిచ్ మండ్ ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.ఈ ప్రాంతంలో ఎక్కువగా నష్టం జరిగి ఉండవచ్చని భయపడుతున్నారు. గ్యాస్,ఇతర సదుపాయాలకు నష్టం కలిగి ఉండవచ్చని అంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ఏభై ఒక్క నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చిందని కధనాలు సూచిస్తున్నాయి.అయితే ప్రాణనష్టం సమాచారం లేదు.కాని ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.కొలరాడో ప్రాంతంలో ఎక్కువ నష్టం ఉండవచ్చని అంటున్నారు.కాగా మరోసారి భూకంపం రావచచని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు భవనాల నుంచి బయటకురావాలని సూచిస్తున్నారు. పదిహేను సెకండ్ల పాటు వచ్చిన ఈభూకంపం రెక్టార్ స్కేల్ పై 5.3 గా నమోదైంది. విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!