బాబుకి హ‌రీష్ స‌వాల్‌


అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం అదినేతపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఒంటికాలితో లేస్తుంటారు. ఇప్పుడు జగన్ వర్గం రాజీనామాల నేపధ్యంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవసరమైతే తాము అవిశ్వాసానికి సిద్దమేనని ఒక మాట అనడాన్ని ఆసరగా చేసుకుని టిఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన సవాల్ చేశారు.చంద్రబాబు మాటలలో కాక చేతలలోచూపాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ తోపాటు తెలుగుదేశం పార్టీకి కూడా డిపాజిట్ రాదని ఆయన అన్నారు.శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెడితే తెలంగాణ కు చెందిన కాంగ్రెస్,టిడిపి ఎమ్మెల్యేలకు ఒక పరీక్ష అవుతుంది.దానిని దృష్టిలో ఉంచుకుని అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే మరో సారి రాజీనామా చేస్తూ ఫాక్స్ ద్వారా లేఖలు పంపారు. ఇప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇరవైతొమ్మదిమంది రాజీనామా చేశారు. కాగా తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు నలుగురు కూడా అలాగే రాజీనామా చేసి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నిజంగానే అవిశ్వాసం పెడితే జగన్ వర్గం ఛాలెంజిగా తీసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది.అయితే వీరందరి రాజీనామాలు ఆమోదించిన తర్వాత అవిశ్వాసం పెట్టినా అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు.హరీష్ రావు ఆ సంగతి కూడా గమనించవలసిన అవసరం ఉందేమో.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!